Jump to content

పుట:Manu Charitra.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లలో సౌందర్యవంతుల నతిశయించియున్నది.) అకటా = అయ్యో, వీఁడు = ఈబ్రాహ్మణుఁడు, ననున్ = నన్ను, పరిగ్రహించినన్ = కైకొనినచో, మరున్ = మన్మథుని, ఏలనిబంటుగాన్ = తనంతఁదానైన సేవకునిఁగా, (జీతము బత్తెము లీయక యుచితముగా బానిసెతనముచేయు బంటువానిఁగా), డక్కఁగొనంగఁరాదె = లోఁబఱుచుకోరాదా?

దక్కపదము డక్క యనుటకు —

తే. "డంభ డిండీర డోలికాడాడిమాది
    శబ్దముల కాదివర్ణముల్ సంస్కృతమున
    నుపరివర్ణతృతీయమై యొప్పునట్లు
    దెనుఁగున దకారము డవర్ణ మొనరుచుండు.

తే. దాఁక దగ్గఱి దిగ్గియ దాయఁ బోయి
    దాపలను దిగ్గుచును వైకృతముల మొదల
    డాఁక డగ్గఱి డిగ్గియ డాయఁబోయె
    డాపలను డిగ్గు మని డా కడంగి నిల్చు.”

(అప్పకవీయము)

తా. నలకూబరజయంతవసంతాదులను చక్కఁదనమున జయింపఁజాలునీతఁ డెక్కడివాఁడో గావలయు. ఈచక్కఁదన మెక్కడ? బ్రాహ్మణకుల మెక్కడ? వహ్వా! ఈతఁడు నన్ను గైకొన్నచో మన్మథసుఖముల నిరాటంకముగా ననుభవించఁదగును గదా!

అలం. విషమాలంకారము.

సీ.

వదనప్రభూతలావణ్యాంబుసంభూత
          కమలంబు లన వీనికన్ను లమరు
నిక్కి వీనులతోడ నెక్కసక్కెము లాడు
          కరణి నున్నవి వీనిఘనభుజములు
సంకల్పసంభవాస్థానపీఠికవోలె
          వెడఁద యై కనుపట్టు వీనియురము