Jump to content

పుట:Manu Charitra.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విభ్రాంతి = అనురాగమువలనిమరపు, బోధకళన్ = జాగ్రత్తను, మాన్పెన్ = పోఁగొట్టెను.

తా. మనుష్యుని భావించుటచే నాదేవతాస్త్రీకి భమరకీటన్యాయమున మనుష్యత్వము సంభవించెనా యనునట్లు దేవతాధర్మములగు, అనిమేషస్థితి, అస్వేదతావృత్తి, బోధకళ, మాఱి బిత్తరపుఁజూపు నవస్వేదసమృద్ధి మోహవిశ్రాంతి యను మనుష్యధర్మములు వాటిల్లెను.

అలం. ఉత్ప్రేక్ష. తద్గుణము.

వ.

ఇ ట్లతనిరూపరేఖావిలాసంబులకుం జొక్కి యక్కమలపత్రేక్షణ యాత్మగతంబున.

34

టీ. ఇట్లు = ఈవిధముగా, అతని = ఆప్రవరాఖ్యుని, రూపరేఖావిలాసంబులకున్ = సౌందర్యక్రమమునకును, విలాసమునకును, చొక్కి = మోహముఁ గొని, (పరవశయై) అక్కమలపత్రేక్షణ = తమ్మిఱేకులఁ బోలుకన్నులుగల యాయింతి, ఆత్మగతంబునన్ = తనలో, (పైపద్యముతో నన్వయము.)

ఉ.

ఎక్కడివాఁడొ యక్షతనయేందుజయంతవసంతకంతులన్
జక్కఁదనంబున గెలువఁజాలెడువాఁడు మహీసురాన్వయం
బెక్కడ యీతనూవిభవ మెక్కడ యేలని బంటుగా మరున్
డక్కఁ గొనంగరాదె యకటా నను వీఁడు పరిగ్రహించినన్.

35

టీ. (ఈబ్రాహ్మణుఁడు) యక్షత...కంతులన్ - యక్షతనయ = నలకూబరుని, ఇందు = చంద్రుని, జయంత = ఇంద్రునికొడుకైన జయంతుని, వసంత = వసంతఋతుపురుషుని, కంతులన్ = మన్మథుని, చక్కఁదనంబునన్ = సౌందర్యముచేత, గెలువన్ = జయించుటకు, చాలెడువాఁడు = సమర్థుఁడగువాఁడు, ఎక్కడివాఁడొ = ఎక్కడనుండి వచ్చినవాఁడొ, మహీసురాన్వయంబు = బ్రాహ్మణులకులము, ఎక్కడ, ఈ, తనూవిభవము = శరీరసంపత్తి, ఎక్కడ, (దేవతాంశమునఁ బుట్టినవారికె యపూర్వసౌందర్యాతిశయ ముండును. సామాన్యముగ బ్రాహ్మణజాతిలో సౌందర్య మరుదు. ఇతనిసౌందర్యము వేల్పు