| మ. | మునుమున్ పుట్టెడుకొంకు లౌల్యము నిడన్ మోదంబు విస్తీర్ణతన్ | 30 |
టీ. లతాంగి = ఆస్త్రీ, మునుమున్ = ముందుముందు, పుట్టెడుకొంకు = జనించెడు సంశయము, లౌల్యము = చాపల్యమును, ఇడన్ = ఒసఁగఁగా, మోదంబు = సంతోషము, విస్తీర్ణత = వైశాల్యమును, చొనుపన్ = చెందింపఁగా, కోర్కులు = కోరికలు, క్రేళ్లు ద్రిప్పన్ = దుసికిల్లాడింపఁగా, కన్నులు కొంకుచేతను గోర్కులచేతను జంచలము లయ్యెను. మదిమెచ్చుల్ = మనసు నందలి మెప్పులు, ఱెప్ప లల్లార్పన్ = కనుఱెప్పలను ద్రిప్పఁజేయఁగా, అత్యనుషంగస్థితి = ఎంతయుఁ జేరిక గలది యగునునికి, ఱిచ్చపాటు = నిశ్చేష్టత్వమును, చంద్రికల్ = వెన్నెలలు, తనుకన్ = కాయఁగా, ప్రఫుల్లన్నేత్రపద్మంబులన్ = విరియఁబాఱుచున్న కనుదమ్ములతో (తామరపూవులవలె నిండారవిచ్చినవియు ననురాగప్రకటనము చేయునవియు నగు చూపులతో) భూసురున్ = బ్రాహ్మణుని, చూచెన్ = కాంచెను.
చూపులు, శ్వేతముగా వర్ణించుట కలదు.
మ. “జగతీనాథునిముందటన్ నిలిచె సాక్షాత్కారముం బొంది యా
జగదేకస్తవనీయ శారద శరచ్చంద్రాతపాలోకమున్."
శృంగారనైషధము. ఆ. 4
తా. ఆతనిఁ జూచినతోడనే కలిగినకొంకు బెళుకును కల్గింపఁగా సంతోషము వైశాల్యముఁ జెందింపఁగా నుప్పతిల్లు కోరికలచే తుసికింతలాడి లోనిమెప్పులు ఱెప్ప లల్లార్పించఁగా నదివఱ కెఱుక లేనిచేరిక నిశ్చేష్టత్వమును గూర్పఁగా విరఁబాఱుకన్నుదమ్ములతో నాయింతి యొయ్యారముగా వెన్నెలలు నిగుడునట్లు ప్రవరునిఁ చూచెను.
అలం. పరిణామాలంకారము.