Jump to content

పుట:Manu Charitra.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనీనికలు కోడెతనంపుఁబడుచులకు నల్లకలువలకాంతితో నలరారుచుండును. ఈభావముతోనే కనులు నల్లకలువలని కవులు వాడుట సుప్రసిద్ధము.

రోమాంచము సాత్వికభావము. హర్షాతిశయముచే రోమాంచమయ్యెను. శ్లో. “రోమాంచో విస్మయోత్సాహహర్షాద్యైః” అని యాలంకారికమతము. హృదయానందవశమునఁ గనులు వికసించుటయుఁ బులకరించుటయు సహజము. ఇటు లనుటకుఁ బ్రమాణము.

శ్లో. “మనోరథస్య లాభేన సిద్ధ్యా యోగ్యస్య వస్తునః
    శ్రియసంగమదేవాదిప్రసాదాదేశ్చ కల్పితః,
    మనః ప్రసాదో హర్షః స్యాత్తత్ర నేత్రస్య ఫుల్లతా
    ప్రియభాషణమాశ్లేషః పులకానాం ప్రరోహణమ్.”

పైని జెప్పఁబడిన నేత్రఫుల్లతయే నయనాంబుజవికసనము. మనోభావమును బయలుపఱచుభావముల ననుభావము లందురు. రోమాంచము అనుభావవిశేష మగు సాత్వికభావము. ఇది వరూథినివలపు నెఱిఁగించును.

తా. అట్లు వీణ వాయించుచున్న యావేల్పులేమ కన్నుదమ్ములను విరియఁజేసి కలువదండలను గురియుచూపులతో గుబ్బచన్ను లుబికి గగుర్పొడిచి మిసమిసలాఁడఁగా లోలోఁ గోరికలు రేఁగఁగా నలకూబరునిఁ బోలిన యా ప్రవరునిఁ జూచెను.

అలం. పరిణామము.

ఉ.⁠

చూచి ఝళంఝళత్కటకసూచితవేగపదారవింద యై
లేచి కుచంబులున్ దుఱుము లేనడు మల్లలనాడ నయ్యెడన్
బూచినయొక్కపోఁకనునుబోదియఁ జేరి విలోకనప్రభా
వీచికలన్ దదీయపదవీకలశాంబుధి వెల్లి గొల్పుచున్.

⁠ 29