Jump to content

పుట:Manu Charitra.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నున్న, వితర్దిమీఁదన్ = తిన్నెపై, శీతలానిలము = చల్లగాలి, ఒలయన్ = వీవఁగా, ఆసీన = కూరుచున్నది. అన్నిలింపాబ్జముఖియున్ = ఆవేలుపువెలఁదియును, అయ్యవసరమున్ = ఆసమయమునందు (పైపద్యముతో నన్వయము.)

సీ.

తతనితంబాభోగధవళాంశుకములోని
          యంగదట్టపుఁగావిరంగువలన
శశికాంతమణిపీఠి జాజువాఱఁగఁ గాయ
          లుత్తుంగకుచపాళి నత్తమిల్లఁ
దరుణాంగుళీధూతతంత్రీస్వనంబుతో
          జిలిబిలిపాట ముద్దులు నటింప
నాలాపగతిఁ జొక్కి యరమోడ్పుఁగనుదోయి
          రతిపారవశ్యవిభ్రమముఁ దెలుపఁ


తే.

బ్రౌఢిఁ బలికించుగీతప్రబంధములకుఁ
గమ్రకరపంకరుహరత్నకటకఝణఝ
ణధ్వనిస్ఫూర్తితాళమానములు గొలుప
నింపు దళుళొత్త వీణ వాయింపుచుండి.

27

టీ. తత... రంగువలనన్ - తత = విరివియైన, నితంబ = పిఱుఁదులయొక్క, ఆభోగ = పరిపూర్ణతగల, ధవళాంశుకములోని = తెల్లసెల్లాలోని, అంగదట్టపు = పావడయొక్క, కావిరంగువలన = ఎఱుపురంగువలన, శశికాంతమణిపీఠి = చంద్రకాంతమణులు పొదిగిన పీఠము, జాజువాఱఁగన్ = చంద్రకాంతమణులు పొదిగిన ఎఱుపు సోఁకఁగా, (లోనియంగదట్టపుఁగావిరంగు పైనున్న పలుచనిసెల్లానుండి మణిపీఠికమీఁదికిఁ బ్రసరించుచున్నదనుట.) కాయలు = వీణసొఱకాయలు, ఉత్తుంగకుచపాళిన్ = ఉన్నతమైన స్తనప్రదేశమున, అత్తమిల్లన్ = ఒత్తుకొనఁగా, పిఱుఁదులు వ్రేఁగుగా నుండుటచేఁ గావివల్వ విశాలమైనదని యూహ్యము. శశికాంతము స్వచ్ఛశిల గావున వలువకావిరం గందుఁ బ్రతిబింబించెనని భావము. గుబ్బ లుబ్బుగా నున్నగుబ్బెతలు వీణ గొని వాయించుతఱి వీణసొరకాయలు