బ్రవహించు గంగాప్రవాహమున కిరుప్రక్కలఁ బెట్టినయిసుకలంకలమీఁదఁ బెరిఁగి సూర్యకిరణములను జొరనీయక చిక్కనై చీకటి గ్రమ్ము పోఁక, పొన్న, నారింజ, అరఁటి మొదలగు వృక్షజాతులతోఁపులలోఁ గూత పెట్టు కోయిలలు, గోర్వంకలు మొదలగు పక్షులధ్వనులును వానికిఁ బ్రతిశబ్దములిచ్చు నెలఱాలగుహలును గలిగి గంధర్వులయొక్కయు, యక్షులయొక్కయు, సంగీతములచే నొప్పారుకోన నొకదానిఁ బ్రవరుఁడు కాంచెను.
అలం. ఉత్ప్రేక్ష.
| క. | కనుఁగొని యిది మునియాశ్రమ | 20 |
టీ. కనుఁగొని = ఆలోయను గాంచి, ఇది, మునియాశ్రమము = మునులు తపస్సు జేయుచోటు, అనుతహతహ = అనునట్టి భ్రాంతి, పొడమి = కలిగి, ఇచటికిన్ = ఈయాశ్రమమునకు, అరిగినన్ = పోయినచో, నాకున్, ఒకతెఱకువ = ఒక యుపాయము, కననగున్ = దొరకవచ్చును, అని, మనమునన్ = మనస్సునందు, కలదిగులు = కలిగినచింత, కొంత = కొంచెము, మట్టు పడంగన్ = మరుగుపడఁగా, (తగ్గఁగా) పైపద్యముతో నన్వయము.
| చ. | నికటమహీధరాగ్రతటనిర్గతనిర్ఝరధారఁ బాసి లో | 21 |
టీ. ధరణీసురుఁడు = బ్రాహ్మణుఁడు (ప్రవరుఁడు), నికట...ధారణ - నికట = సమీపమందలి, మహీధరాగ్ర = కొండకొనయొక్క, తట = ప్రదేశమునుండి, నిర్గత = వెల్వడిన, నిర్ఝరధార = సెలయేటిజాలును, పాసి = విడచి (వేఱయి), తలక్రిందుగా = ఎత్తునుండి పల్లమునకు, మలఁకలై = మెలికలు