Jump to content

పుట:Manu Charitra.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాగంగానదియిరుప్రక్కలను, ఇసుక పెట్టిననేలన్ = ఇసుకదిబ్బ పెట్టిన లంకనేలను, ఏచి = ఎదిగి, అర్కాంశులన్ = సూర్యకిరణములను, చొరనీక = ప్రవేశింపనీయక, దట్టమై = చిక్కనై, ఇరులు గవియు = చీకట్లు క్రమ్ము, క్రముక...వీథిన్ - క్రముక = పోఁక, పున్నాగ = పొన్న, నారంగ = నారింజ, రంభా = అరఁటి, నారికేళ = కొబ్బరి, ఆది = మొదలగు, విటపి = చెట్లయొక్క, కాంతారవీథిన్ = తోఁపులవరుసను, కెరలుపిక...ధ్వనిన్ - కెరలు= కూయుచున్న, పిక = కోయిలలయొక్కయు, శారికా = గోర్వంకలయొక్కయు, కీర = చిల్కలయొక్కయు, కేకి = నెమిళ్లయొక్కయు, భృంగ = తుమ్మెదలయొక్కయు, సారస = బెగ్గురుపక్షులయొక్కయు, ధ్వనిన్ = చప్పుడుచే, తనలోని చంద్రకాంతదరులు = తనలోపలి చంద్రకాంతమణిమయ మైనగుహలు, ప్రతిశబ్దము = ప్రతిధ్వనిని, ఈనన్ = జనింపఁజేయఁగా, గంధర్వ...ఘూర్ణితము - గంధర్వ = గంధర్వులయొక్కయు, యక్ష = యక్షులయొక్కయు, గాన = గానముచే, ఘూర్ణితము = తిరుగుడుపడుచున్నది, అగు, ఒక్కకోనన్ = ఒకానొకలోయను, కనియెన్ = చూచెను.

కోయిలలు పల్లవితచూతాదివృక్షములందును, జిలుకలు నారంగాదిఫలవృక్షములందును, గోరువఁక లందునిందును నుండెను. నెమిళ్లు చెట్లు క్రిక్కిరిసి చీకటు లొలయుటచే నదియ మేఘమని నృత్య మొనరించుచుండెను. తుమ్మెదలు రొదలుచేయుచున్న వనుటచే నచటిలతలు పూచి మకరందభరితములై యుండె ననియు బెగ్గురు పక్షులు అఱచుచున్నవనుటచే నచటిజలాశయములు విహారయోగ్యములుగా నున్న వనియు భావము.

ఇరులు నిత్యబహువచనాంతము. దృష్టాంతము:—

క. "కే లేకవచన మరయఁగఁ, బాలును దెమ్మెరలు సహజబహువచనంబుల్"

కావ్యాలంకారచూడామణి (ఆ.8)

తా. ఇంద్రుని వజ్రాయధపునఱకు గుఱు తనునట్లు మీఁదినుండి యడుగువఱకును నెఱ్ఱనైనయొడ్డులు గల కొండచరికినడుమఁ గన్పడులోయలోఁ