లాడుకొను (విహరించు) సచ్ఛాత్రులు - మంచిశిష్యులు, ఇంతకున్ = ఇంతటియీయెడబాటునకు, ఎంత చింతింతు రొక్కొ = ఎంతవిచారము నొందుదురో గదా! అతిథిసంతర్పణంబులు = అన్నార్థులై వచ్చినవారి సమారాధనములు, ఏమయ్యెనొక్కొ = ఏమైపోయినవో గదా! అగ్నులు = గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని అను నగ్నిహోత్రములు, ఏమయ్యెనొక్కొ = ఏమియై పోయినవోగదా! నిత్యంబులైనకృత్యములన్ = నిత్యమును జేయవలసినకర్మములను, పాసి = తప్పించి, మిన్నులు పడ్డచోటన్ = ఆకాశము ఒఱిఁగినప్రదేశమున (బహుదూరప్రదేశమున), పాఱవైచితె = మిగులదూరదేశమునందుఁ బడవైచితివా? మిగులదూరమున బంధువులకును నిత్యకృత్యములకు దూరము చేసి కూలఁద్రోచితివా యనుట.
అలం. సందేహము.
శ్రీనాథకవియుఁ “బొకాలెద మిన్నులుపడ్డచోటికిన్" అని కాశీఖండమునఁ జెప్పినాఁడు. మిన్నులు పడ్డచోటు, కానని క్రంతలు ఇవి జాతీయములు. మిన్ను విఱిగి నేలఁ బడిన యీభయంకరదూరభూములలోఁ బడవేసితివా యని దేవుని నిష్ఠురము లాడుట.
| క. | నను నిలు సేరునుపాయం | 18 |
టీ. ననున్ = నన్ను, ఇలు సేరునుపాయంబు = ఇంటికిఁ బోవుతెఱఁగు, ఒనరింపఁగన్ = చేయుటకు, చాలుసుకృతి = చాలిన పుణ్యాత్ముఁడు, ఒకఁడు = ఎవఁడైన నొక్కఁడు, ఒదవఁడొకో = కలుగఁడా యేమి? అనుచున్ = అనుకొనుచు, చింతాసాగరమునన్ = విచార మను సముద్రమునందు, మునిఁగి = మునిఁగినవాఁడై, పోవుచున్, ఎదురన్ = ముందుభాగమునందు, పైపద్యముతో నన్వయము.