తా. అరుణాస్పదపుర మెక్కడ? మంచుగొండ యెక్కడ? పొగరున నేను రాఁదగునా? అయ్యో! వెనుక వచ్చినవై పిది యని యెఱుఁగను. ఇంక బయలు వెడలువిధ మెట్లో!
| మ. | అకలంకౌషధసత్త్వమున్ దెలియ మాయాద్వారకావంతికా | 16 |
టీ. అకలంకౌషధసత్త్వమున్ = నిష్కల్మషమయిన యౌషధపుసామర్థ్యమును, తెలియ = తెలిసికొనుటకు, మాయా...ప్రయాగములు - మాయా = మాయానగరము - హరిద్వారము, ద్వారకా = ద్వారావతీనగరము, అవంతి = ఉజ్జయినీపట్టణము, కాళి = వారణాసి, కురుక్షేత్ర = కురుక్షేత్రము, గయా = గయాక్షేత్రము, ప్రయాగ = ప్రయాగక్షేత్రము (వీనిని) నే సేవింపక = నేను సందర్శించుటకుఁ బోవక, ఉద్దండ...వ్యాఘ్రము - ఉద్దండ = భయంకరములైన, గండక = గండమృగములు, వేదండ = ఏన్గులు, వరాహ = అడవిపందులు, వాహరిపు = అడవిదున్నలు, ఖడ్గ = ఖడ్గమృగములు, వ్యాఘ్రము = పెద్దపులులు కలది (ఖడ్గగండకశబ్దము లేకార్థవాచకము లయ్యు నిందు వేఱుగాఁ బ్రయోగింపఁబడుట కాధారము కానము.) ఇమ్మంచుఁగొండకున్ = హిమవత్పర్వతమునకు, రాఁ జెల్లునె = వచ్చుట తగునా? శ్రోత్రియుల్ = వేదము చదివి కర్మముల నాచరించువారు, బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా = బుద్ధిమాంద్యముచేఁ గల్పింపఁబడిన వెఱ్ఱితనము గలవారు గదా! అర్థాంతరన్యాసాలంకృతి.
వేదము పఠించినవారికి బుద్ధివికాస ముండదు. కాళిదాసు విక్రమోర్వశీయమున "వేదాభ్యాసజడః" అనెను. కేవలపఠనము ప్రతిభాదాయకము