అడుగుదోయి, సపదిస్ఫుటార్తిన్ = అప్పుడే స్పష్టమగు దుఃఖముచేఁ (సపరిస్ఫూర్తిన్ = చక్కఁగాఁ దోఁచుచున్న దుఃఖముచేఁ గూడుకొనుటచేత. పా.), మతిన్ = మనస్సునందు, చింతించుచున్ = విచారము చెందుచు, ఆవ్విధంబు = అ ట్లెగిరిపోలేకపోవుటకుఁ గలకారణమును, హా = అక్కటా, సిద్ధాపదేశంబునన్ = సిద్ధునిమిషచేత, (సిద్ధోపదేశంబున = సిద్ధునియుపదేశముచేత, పా.), దైవంబ = దైవమా! నన్నున్, ఇట్లు = ఈవిధముగా, ఈఘోరవనప్రదేశమునకున్ = ఈభయంకరమైన యడవినేలకు, తెచ్చితె = తీసికొనివచ్చితివా?
తొలుత దైవకృతమున కసాధ్యము లేదని నిశ్చయించుకొనెను. కావున ఘోరప్రదేశమునఁ దాను చిక్కుపడుటకు సిద్ధుఁడు నిమిత్తమాత్రుఁడు. దైవ మాపదలఁ గూర్చునెడ నొకనిని నిమిత్తమాత్రునిగఁ గల్పించును.
తా. ఆవిధముగాఁ బాదలేపము పోయినయాప్రవరుఁడు తనయూరికిఁ బోవుటకు నెగురలేకపోవుటచేఁ బాదలేవము కరఁగిపోయిన దని తెలిసికొని "యయ్యో! దైవమా! సిద్ధుఁ డనుమిష కల్పించి న న్నీఘోరారణ్యప్రదేశమునకుఁ గొనివచ్చితివా?” యని దుఃఖించెను. కావ్యలింగము.
| క. | ఎక్కడియరుణాస్పదపుర | 15 |
టీ. ఎక్కడి అరుణాస్పదపురము = అరుణాస్పదపుర మెక్కడ నున్నది. ఎక్కడితుహినాద్రి = మంచుకొండ యెక్కడ నున్నది! (దీనికి దానికి మిక్కిలి దూరము గదా!) క్రొవ్వి = మదించి, ఏన్ = నేను, రాన్ = వచ్చుట, తగునే = కూడునా? అక్కట = అయ్యో! మును = మునుపు, చనుదెంచిన దిక్కు = ఇక్కడకు వచ్చినదిశ, ఇది = ఇట్టిది, అని యెఱుఁగన్ = అని నే నెఱుంగఁజాలను, వెడలుతెరువు = ఇటనుండి పోయెడిత్రోవ (పా. వెడలు తెఱఁగు = బయలు వెడలువిధము), ఎయ్యదియో = ఏదోగదా!