Jump to content

పుట:Manu Charitra.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. ప్రళయకాలమున మహాగ్నిజ్వాలలచేఁ గాలి భస్మమైపోయిన "భూమి యీహిమవత్పర్వతపుఁజలువఁ గొనక యుండినచో, మరల రూపుచెంది తరుగుల్మలతాదులను మొలిపించుకొనఁజాలదు. కావ్యలింగము.

సీ.

పసుపునిగ్గులు దేఱుపాఁపజన్నిద మొప్పఁ
          బ్రమథాధిపతి యింటిప ట్టెఱింగె
శచి కీఁత గఱపుచుఁ జదలేట సురరాజు
          జలకేళి సవరించుచెలు వెఱింగె
నదనుతోఁ జేఁపి చన్నవిసి యోషధుల మ
          న్మొదవు కొండల కెల్లఁ బిదుక నెఱిఁగె
వేల్పుటింతులలోన విఱ్ఱవీఁగుచు మేన
          నవరత్నరచనలరవణ మెఱిఁగెఁ


తే.

బరిపరివిధంపుఁజన్నంపుబరికరంపు
సొంపుసంపద నిఖిలనిలింపసభయు
నప్పటప్పటికిని జిహ్వత్రుప్పు డుల్ల
నామెత లెఱింగె నీతుషారాద్రికతన.

11

టీ. ఈతుషారాద్రికతన = ఈమంచుకొండమూలమున, ప్రమథాధిపతి = శివుఁడు, పసుపునిగ్గులు = పసుపుకాంతులు, తేఱుపాఁపజన్నిదము = తేటగాఁ గన్పడు సర్పయజ్ఞోపవీతము, ఒప్పున్ = ఒప్పునట్లు, బ్రహ్మచర్యాశ్రమధర్మమును నిర్వర్తించుచు ననుట, ప్రమథాధిపతి = ప్రమథులగణమున కధిపతియగు శంకరుఁడు, ఇంటిపట్టు = గృహస్థధర్మము, ఎఱిఁగెన్ = తెలిసికొనెను. (హిమవంతుఁడు కూఁతు నిచ్చుటచే, శివునకుఁ దనసర్పయజ్ఞోపవీతమునకుఁ బసు పంటుకొని పచ్చన కాఁగా గృహస్థత్వ మలవడెననుట) (పా. పసుపునిగ్గులు మీఱు = పసుపుకాంతు లతిశయించు) సురరాజు = ఇంద్రుఁడు, శచికిన్ = శచీదేవికి, ఈఁత గఱపుచున్ = ఈఁత నేర్పుచు, చదలేటన్ = ఆకాశగంగలో, జల