సంతసముతో, చూచి = సందర్శించి, ఆత్మలోనన్ = తనమనస్సునందు, మీఁదిపద్యముతో నన్వయము.
తా. భగీరథుఁడు తపస్సు చేసినచోటును, ఆకాశగంగ భూమి కవతరించిన ప్రదేశమును, పార్వతి శివునకు శుశ్రూష సల్పినప్రదేశమును, మన్మథుఁడు శివునికంటిమంటచే నీ ఱయినట్టి జాలి గల్పించుప్రదేశమును, అగ్నిదేవుఁడు సప్తర్షులకాంతలపై మోహముఁ జెందినప్రదేశమును, గుమారస్వామి జననము చెందిన ఱెల్లుదుబ్బులను జూచి సంతోషించి ప్రవరుఁడు తనలో.
| చ. | విలయకృశానుకీలములవేఁడిమిఁ బోఁడిమి మాలి వెల్మిడిన్ | 10 |
టీ. విలయ...వేఁడిమిన్ - విలయ = ప్రళయకాలపు, కృశానుకీలముల = అగ్నిజ్వాలలయొక్క, వేఁడిమిన్ = వేఁడిచే, పోఁడిమి మాలి = రూపు మాసి, వెల్మిడిన్ = భస్మమున, కలసిన = కలసిపోయిన, భూతధాత్రి = భూమి, క్రమ్మఱన్ = తిరిగి, రూపయి = ఆకారమేర్పడి, నిల్చి = ఎప్పటివలె నిలువఁబడి, ఓషధులు = వృక్షలతాదిమూలికలు, మొలవఁగ = మొలచునట్లుగా, చేయునట్టి = చేయఁగాఁగల, నయమున్ = మంచిని, ప్రతికల్పము = ఒక్కొకసృష్టిప్రారంభకాలమునను, ఈచలిమలవల్లన్ = ఈహిమవత్పర్వతమువలన, ఉల్లసిలు చల్లఁదనంబును = ఉప్పతిలునట్టి శైత్యమును, ఊనకుండినన్ = పొందకుండినచో, ఎట్లు = ఏవిధముగా, కాంచున్ = పొందును. వెలి+మిడుఁగు= వెలిమిడి, దీనిహ్రస్వరూపము వెల్మిడి. వెల్మిడి యన బూది యనుటకు —
సీ. "తగనంధునకును నద్దంబు చూపినయట్లు
వెలిమిడిలో నెయ్యి వేల్చినట్లు”
పంచతంత్రము