| తే. | తపసియిల్లాండ్రచెలువంబు దలఁచి తలఁచి | 9 |
టీ. ప్రవరాఖ్యుఁడు = ప్రవరుఁడను పేరుగల బ్రాహ్మణుఁడు (కర్త), విడుదపెన్నెఱిగుంపు = నిడుపయి నిగనిగలు గలతలవెండ్రుకలప్రోవు, జడగట్టన్ = పెనఁచుకొనిపోవునట్లు, సగరుముమ్మనుమండు = భగీరథుండు, తపము = తపస్సును, కైకొనినచోట = పూనినప్రదేశము, జరఠ...వెన్ను - జరఠ = ముదివాఁడగు, కచ్ఛపకులేశ్వరు = తామేటిదొర (ఆదికూర్మము) యొక్క, వెన్ను = వీఁపు, కానరాన్ = అగపడునట్లు, గంగ హిమగిరినుండి పడుటచే ధారాపాతమున భూమి విచ్చి భూమి వహించిన యాదికూర్మముమూఁపు కనిపించె ననుట. మిన్నేఱు = ఆకాశగంగ (ప్రవాహము పడునురవడికి భూమి యంతవఱకుఁ దెగియె ననుట). దిగినచోటు = అవతరించిన ప్రదేశము. పుచ్చడీకతనంబు = సిగ్గరితనమును, పోఁబెట్టి = తొలఁగఁద్రోసి, గిరికన్య = పార్వతి, పతిన్ = భర్తను (శివుని), కొల్వన్ = సేవించుటకు, ఆయాసపడినచోటు = శ్రమపడినప్రదేశమును, వలరాచరాచవాఁడు = మన్మథుఁడను క్షత్రియుఁడు, అలికాక్షుకనువెచ్చన్ = ఫాలనేత్రుని (శివుని) కంటిమంటచే, కరఁగిన = స్రగ్గిపోయిన, అలకనికరపుఁజోటు = ఆజాలిగలిగించుతావు, తపసియిల్లాండ్రచెలువంబున్ = సప్తర్షులస్త్రీలచక్కందనము, తలఁచితలఁచి = స్మరించి స్మరించి, (మునిపత్నులఁ గామించుట యయుక్త మని యూహించి యెట్టకేలకు సాహసించి) ముచ్చిచ్చును, (గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులు అను) మూఁడగ్నులను, విరాళి = మోహము, కొన్నచోటు = పొందినయట్టిప్రదేశము, కనపపులు = ఱెల్లుగడ్డి, వేల్పుఁబడవాలున్ = దేవతలసేనాధిపతిని (కుమారస్వామిని), కన్నచోటు = ప్రసవించినప్రదేశమును, హర్షమునన్ =