టీ. తొండముల్ = తొండములను, చాఁచి = చాగించి, అందుగుఁజిగుళ్లకున్ = అందుగుచెట్లయొక్క లేఁతయాకులకొఱకు, నిక్కు = సాగఁబాఱు, మునికాళ్లతో నుండి నిలుచుండునట్టి, కరులదంతచ్ఛాయ = ఏన్గులదంతములకాంతి, కడలుకొనఁగన్ = విస్తరించఁగా, ఏనుఁగుతుండము వ్రాలియున్నంతవఱకు దంతకాంతులు విరివిగాఁ బ్రసరింప వీలుండదు. సాఁచి చిగుళ్లకు నిక్కినపుడు దంతములకాంతి ప్రసరించును. (అందుగుచిగుళ్ల నందుకొనుటకై నిక్కి తొండములు సాఁచు గజములదంతములకాంతి నలువైపుల వ్యాపించుచున్న దనుట.) సెలవులన్ = పెదవులకొనలందు, వనదంశములఁ = అడవియీఁగలు, మూఁగి నెఱపెట్టన్ = సందు చేయఁగా, క్రోల్పులుల్ = పెద్దపులులు, పొదరిండ్లన్ = తీఁగ లల్లుకొని యిండ్లవలెనుండు పొదలయందు (నికుంజములందు), గుఱక లిడఁగన్ = గురుపెట్టి నిదురఁబోవుచుండ, (సెలవులు పొలసుకంపొలయుటచే నీఁగల మూఁగి తొలుచుచుండెను. నిద్రామాంద్యము గాన నొడ లెఱుంగవయ్యెను.) అడవియీఁగలు మూఁగి సెలవులకడఁ దొలుచుచుండఁగాఁ బెద్దపులులు మాంసము దిని మత్తెక్కి పొదరిండ్లలో గుఱకలు పెట్టుచున్నవనుట.) సెలయేటియిసుకలంకలన్ = సెలయేళ్లలోని యిసుకదిబ్బలందు, వరాహంబులు = అడవిపందులు, మొత్తంబులై = గుంపులై, త్రవ్వి = నేలయంతయు ముట్టెతోఁ బెకలించి, ముస్తెలు = తుంగగడ్డలు, ఎత్తన్ = కోరతోఁ బైకెత్తుచుండ, (ఏటిలంకలలో నడవిపందులు గుంపులు గుంపులుగాఁ గూడి తుంగముస్తెలను బెల్లగించుచున్నవనుట.) అడ్డంబు, నిడుపును (గల), ఆఁబడ్డలగతిన్ = ఆవుపెయ్యలవలె, మనుఁబిళ్లు = ఆఁడుమన్నులు (ఒకవిధమైన మృగములు), డొంకలనుండి = నడచుటచేఁ బల్లముగా మాఱిన త్రోవలనుండి, క్రేళ్లుదాఁటన్ = దుముకులాడఁగా, (మనుఁబిళ్లు అన నాఁడుమన్నులు; అవియే డొంకల దుముకుచుండ నిఁక మగవానిని గూర్చి చెప్పఁ బని లేదు. ఆఁడుదే యావుపడ్డ యంత యుండ మగ దెంత యుండునో చెప్పం దరము గాదు) ప్రబల...తపమునన్ - ప్రబల = పొగరు రేఁగిన, (మిగులబలముగల) భల్లుక = ఎలుఁగుగొడ్లయొక్క, నఖభల్ల = బల్లెములవంటి
పుట:Manu Charitra.pdf/137
స్వరూపం