Jump to content

పుట:Manu Charitra.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వానచినుకులకుఁ గడిమి పూఁతఁ బూయును.

శ్లో. "నీపం దృష్ట్వా హరితకపిశం కేసరైరర్ధరూఢై
    రావిర్భూతప్రథమముకుళాకన్దళీశ్చానుకచ్ఛం
    ... .... ... ... ... ...
    సారంగాస్తే జలలవముచః సూచయిష్యంతి మార్గమ్.”

మేఘసందేశము

    "నీపకసుమాదికం దృశ్యతే తత్రతత్ర త్వయా (మేఘన) వృష్ట మిత్యను నియత.”

వ్యాఖ్య

వానచినుకులకుఁ బూచునట్లు అలకాజలకణములచేఁ గడిమిచెట్లు పూచెనని భావము.

తా. అలకానదినీటితుంపురులు పైపైఁ బడుచుండుటచేఁ జిగిర్చి పూచిన కడిమిపూలమకరందమును ద్రావి పొగరు రేగినతుమెమైదలఝంకారములతో మెల్లమెల్లఁగాఁ జల్లగాలి వీచెను.

సీ.

తొండము ల్సాఁచి యందుగుఁజిగుళ్లకు నిక్కు
          కరులదంతచ్ఛాయ గడలుకొనఁగ
సెలవుల వనదంశములు మూఁగి నెఱవెట్టఁ
          గ్రోల్పులుల్ పొదరిండ్ల గుఱక లిడఁగ
సెలయేటియిసుకలంకల వరాహంబులు
          మొత్తంబు లై త్రవ్వి ముస్తె లెత్త
నడ్డంబు నిడుపు నాఁబడ్డలగతి మనుఁ
          బిళ్లు డొంకలనుండి క్రేళ్లు దాఁటఁ


తే.

బ్రబలభల్లుకనఖభల్లభయదమథన
శిథిలమధుకోశవిసరవిశీర్ణమక్షి
కాంతరాంతరదంతురితాతపమునఁ
బుడమి తిలతండులన్యాయమున వెలుంగ.

7