Jump to content

పుట:Manu Charitra.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముద్రిత = గుఱుతులు గలదిగాఁ జేయఁబడిన, బదరీతరు = రేఁగుచెట్లయుక్క, చండ = సమూహముయొక్క, మండల = ఆవరణరూపప్రదేశముయొక్క, సరణిన్ = మార్గమున, చనఁజనన్ = పోఁగాఁబోఁగా, (పైపద్యముతో నన్వయము.) ఎదుటన్ = ముందుభాగమున.

తా. ఆప్రవరుఁడు నరనారాయణు లనుమహర్షులు తపస్సు చేసిన బదరీవనము గాంచి దానినడిమిత్రోవను బోఁగాఁబోఁగా.

క.

ఉల్లలదలకాజలకణ
పల్లవితకదంబముకుళపరిమళలహరీ
హల్లోహలమదబంభర
మల్లధ్వను లెసఁగ విసరె మరుదంకురముల్.

6

టీ. ఉల్లల...మల్లధ్వనులు - ఉల్లలత్ = మీఁదికి రేఁగుచున్న, అలకా = అలక యనునదియొక్క, జలకణ = నీటిబిందువులచే, పల్లవిత = చిగిర్చిన, కదంబ = కడిమిచెట్లయొక్క, ముకుళ = మొగ్గలయొక్క, పరిమళలహరీ = సౌరభప్రవాహమునందు, ఈహత్ = అభిలాష గల వగుచున్నట్టియు, లోహల = అవ్యక్తధ్వనులుగల, అలకానదియొడ్డున నున్న కడిమిచెట్టుల పూఁదేనె గ్రోలి కోడెతుమ్మెదలు కైపున నవ్యక్తమధురముగా ధ్వనులు చేయుచుండెను. మదబంభరమల్ల = మదించిన గండుతుమ్మెదలయొక్క, ధ్వనులు, ఎసఁగన్ = మీఱఁగా, మరుదంకురముల్ = చిఱుదెమ్మెరలు, విసరెన్ = వీచెను.

కదంబము నీటికడఁ బెఱుగునది. కావుననే యేటియొడ్డునఁ గడిమిచెట్లున్నటులఁ జెప్పఁబడును.

శ్లో. “జంబూవేతసవానీరకదంబోదుంబరార్జునాః
    బీజపూరకమృద్వీశా లకుచాశ్చ నదాడిమాః
    వంజులో నక్తమాలశ్చ తిలకః పనసస్తథా
    తిమిరో మ్రాతకశ్చైవషోడశానూపజాః స్మృతాః."

బృహత్సంహిత