Jump to content

పుట:Manu Charitra.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంధము దాల్చెను, తీర్థయాత్రవలనన్ = తీర్థములకు యాత్రలు చేయుటచే, ధన్యాత్ముఁగాన్ = కృతార్థమయినయాత్మ గలవానిఁగా, చేయరే = చేయుఁడీ.

తా. అనునప్పటికిఁ బ్రవరుఁడు అతికుతూహలముచే మనస్సు తొట్రుపడఁగా దోసిలి యొగ్గి, మునివర్యా! మీ మాహాత్మ్యమును తెలిసికొనలేక నేను బల్కిన ప్రల్లదపుఁబల్కులను మన్నించి కరుణతో శిష్యుఁడ నగునన్ను తీర్థయాత్రలఁ జేయించి కృతార్థునిఁ జేయ వేఁడెద ననెను.

క.

అనుటయు రసలింగము నిడు
తనవట్రువప్రేఁపసజ్జదంతపుబరణిన్
నినిచినయొకపస రిది యది
యని చెప్పక పూనెఁ దత్పదాంబుజయుగళిన్.

78

టీ. అనుటయున్ = అనఁగా, రసలింగమున్ = రసముతోఁ గావించిన కణికెను, తన = తనయొక్క, వట్రువప్రేఁపసజ్జన్ = గుండ్రనిప్రేఁపబుట్టలోన, నిలిచిన = నిండించిన, ఒకపసరు = ఒకానొకపచ్చనిద్రవము, ఇది యది యని చెప్పక = ఎట్టిదనియుఁ దెలుపక, తత్పదాంబుజయుగళిన్ = ఆతనితామరలవంటి రెండడుగులందును, పూసెన్ = రాచెను.

తా. పరమరహస్యము గానఁ బ్రవరుఁ డాపసరుపే రడుగ లేదు. ఈశ్వరలబ్ధము పరమగోప్యము గాన మునియుఁ బేరు చెప్పక పసరు రాచెను.

క.

ఆమం దిడి యతఁ డరిగిన
భూమీసురుఁ డరిగెఁ దుహినభూధరశృంగ
శ్యామలకోమలకానన
హేమాఢ్యదరీఝరీనిరీక్షాపేక్షన్.

79

టీ. ఆమందున్ = ఆపాదలేపనమును, ఇడి = పూసి, అరిగినన్ = పోవఁగా, భూమీసురుఁడు = బ్రాహ్మణుఁడు (ప్రవరుఁడు), తుహిన...పేక్షన్ - తుహినభూధర = మంచుఁగొండయొక్క, శృంగ = శిఖరములందలి, శ్యామల =