Jump to content

పుట:Manu Charitra.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డాఁపన్ = దాఁచియుంచను, పాదలేప మనుపేరన్ = పాదలేప (అడుగుపూఁత) మనుపేరితో, దివ్యౌషధంపురసంబు = ఉత్తమమగు నోషధిసంబంధ మగు రసము, ఈశ్వరసత్కృపన్ = దైవానుగ్రహముచే, కల్గెన్ = నాకు లభించెను. తద్భూరిప్రభావంబునన్ = దానియొక్క గొప్పమహత్త్వముచేత, పవమా...హంకృతిన్ - పవమాన = వాయువును, మానస = మనస్సును, తిరస్కారి = వంచించునట్టి, త్వరా = వేగముయొక్క, అహంకృతిన్ = అహంకారముచే, చరియింతున్ = తిరుగుదును.

పరమరహస్యముగానఁ జెప్పరాదు. నీవు భూదేవులం దుత్తముఁడవు. కాన నెఱింగించుచున్నాఁడ ననుటచే రహస్యప్రకటనమువలనఁ గలుగు దొసఁగుకంటెఁ దెలుపుటయే ఫలప్రదమని భావము. దివ్యౌషధముగాననే యది భూరిప్రభావము గలది. ఈశ్వరసత్కృపాలబ్ధముగావున నది సామాన్యులకు లభించునది కాదనుట.

తా. విప్రోత్తమా! మిక్కిలి గోప్య మగువిషయమైనను నీకు దాఁపక చెప్పుచున్నాను. దైవానుగ్రహమువలన నాకుఁ బాదలేప మనునొకయోషధీరసము సంభవించినది. దానిసామర్థ్యమున వాయువేగమును మనోవేగమును మించిన వేగముతోఁ దిరుగుదును.

క.

దివి బిసరుహబాంధవసైం
ధవసంఘం బెంతదవ్వు దగ లేకరుగున్
భువి నంతదవ్వు నేమును
ఠవఠవ లేకరుగుదుము హుటాహుటి నడలన్.

76

టీ. దివిన్ = ఆకసమున, బిస...సంఘంబు - బిసరుహ = పద్మములకు, బాంధవ = చుట్ట మగుసూర్యునియొక్క, సైంధవసంఘంబు = గుఱ్ఱముల సమూహము, ఎంతదవ్వు = ఎంతదూరము, దగ లేక = దప్పి లేకఁ (శ్రమలేక) అరుగున్ = పోవునో, భువిన్ = భూమిని, అంతదవ్వున్ = అంతదూరమును, దగయన