గొంటిన్ = చూచితిని, అనుటయున్ = అని సిద్ధుఁడు చెప్పఁగా, ఈషదం...ళుండు - ఈషత్ = కొంచెముగా, అంకురిత = పొడమిన, హసన = నగవును, గ్రసిష్ణు = మ్రింగు, గండయుగళుండు = రెండుచెక్కిళ్లు గలవాఁడు. (ఇంచుక మొలకెత్తు నవ్వును జెక్కిళ్లతో మాటినవాఁడై) ప్రవరుండు, అతనికిన్ = మునికి, ఇట్లు అనియెన్.
| చ. | వెఱవక మీ కొనర్తు నొకవిన్నప మిట్టివి యెల్లఁ జూచి రా | 73 |
టీ. వెఱవక = జంకు చెందక, ఒకవిన్నపము = ఒకమనవి, మీకున్ = తమకు, ఒనర్తున్ = చేయుదును, మి మ్మొకవిషయము ప్రశ్నించెదను. ఇట్టివి యెల్లన్ = ఇట్టివిచిత్రములన్నియును, చూచిరాన్ = చూచివచ్చుటకు, ఎఱకలు = ఱెక్కలు, కట్టుకొన్నన్ = కట్టికొనినను (ఱెక్కలతోఁ బోయి వ్రాలినను), మఱి = ఇంకను, ఏండ్లును బూండ్లును = పెక్కుసంవత్సరములకాలము, పట్టున్ = సరిపోవు, మీమొగము = మీముఖము, ప్రాయపుంజిఱుతతనంబు = వయస్సునఁ జిన్నతనమును, చెప్పక చెప్పెడున్ = నోటితోఁ జెప్పనక్కఱలేకయే చెప్పుచున్నది, అద్దిరయ్య = ఆహా! ఈర = మీరే, మీమహిమలు = మీప్రభావములు, మాకున్ = మాబోంట్లకు, ఎఱుఁగన్ = తెలిసికొనుటకు, తరంబె = శక్యమా! ఈర = మీరలే, ఎఱుంగుదురు = గుర్తెఱుంగుదురు. అనన్యసాధ్యమగు మీమహిమ మాబోం ట్లెఱుంగఁజాలరు, ఏమి చెప్పుదున్ = ఇఁక నేమి చెప్పఁగలను?
తా. జంకు గొనక మీతో నొకటి మనవిచేసికొనుచున్నాను. మీరు చూచితి మన్న విచిత్రముల నెల్లఁ జూచివచ్చుటకు ఱెక్కలు గట్టుకొని