Jump to content

పుట:Manu Charitra.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెట్టునకుఁ బెట్టఁబడిన తేనెతుట్టె (వంటివాఁడు), యజమానుఁడు = గృహస్థుఁడు (వాస్తవ్యుఁడు, కాఁపు, సంసారి, భవనభర్త, కులపతి, కుటుంబి, ఈ పదము లన్నియు గృహస్థుఁ డనునర్థము కలవియే) యజమానుఁడు = గృహస్థుఁడు, అంకస్థితార్థపేటి = తొడపైనున్న ధనపుఁబెట్టె (వంటివాఁడు) వాస్తవ్యుఁడు = గృహస్థుఁడు, పెరటికల్పకము = దొడ్డిలోనికల్పవృక్షము (వంటివాఁడు) కాఁపు = గృహస్థుఁడు, దొడ్డిన్ = పెరటియందు, పెట్టిన = ఉంచిన, వేల్పుగిడ్డి = కామధేనువు (వంటివాఁడు) సంసారి = గృహస్థుఁడు, కడ = పారము, లేని = లేకుండు, నడబావి = దిగుబావి (వంటివాఁడు), భవనభర్త = గృహస్థుఁడు, సవిధమేరునగంబు = సమీపమున నున్న మేరుపర్వతము (వంటివాఁడు) కులపతి = గృహస్థుఁడు, మరుదేశ...ప్రవ - మరుదేశ = నీరు లేని ప్రదేశమందలి, పథి = త్రోవయొక్క, మధ్యమ = నడుమనుండు, ప్రప = చలిపందిరి (వంటివాఁడు), కుటుంబి = గృహస్థుఁడు, ఆఁకటికిన్ = ఆఁకలివేళకు, ఒదవు సస్యము = ఉపయోగపడు పైరు, కానన్ = కాఁబట్టి, భూసురోత్తమ = బ్రాహ్మణశ్రేష్ఠుఁడా! గార్హస్థ్యమునకున్ = గృహస్థత్వమునకు, సరియె = ఇతరాశ్రమములు సమానములా? కా వనుట. సమీపమున నున్న తంగెటిజున్ను, తొడపైనున్న ధనపుఁబెట్టె మొదలగునవి సర్వదా యెటుల సుసాధ్యములో యటులె గృహస్థాశ్రమము తదితరులకు సహాయకర మని భావము. రూపకోల్లేఖములు అలంకారములు.

తా. చెవిటి, కుంటి, గ్రుడ్డి మొదలయిన దిక్కుమాలినవారి కెల్లను గృహస్థుఁడే రక్షకుఁడు. కాబట్టి గృహస్థాశ్రమమువంటియాశ్రమము లేదు.

క.

నావుడుఁ బ్రవరుం డిట్లను
దేవా దేవర సమస్తతీర్థాటనమున్
గావింపుదు రిలపై నటు
గావున విభజించి యడుగఁ గౌతుక మయ్యెన్.

67

టీ. నావుడున్ = అనఁగా, (మునివరుఁడు వాకొనినంతన) ప్రవరుఁడు = ప్రవరాఖ్యుఁడు, ఇట్లు అనున్ = ఈవిధముగా బ్రత్యుత్తరము నొసంగెను.