Jump to content

పుట:Manu Charitra.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యొక్క, అంబు = ఉదకములకు, పౌనరుక్త్యములు = అవియే ఇవి (కావుటచే వీనిని వేఱుగాఁ జెప్పుట పునరుక్తి.) అవియే యని మఱలఁ జెప్పుట. ఒకమాఱు చెప్పినదానిని మఱలఁ జెప్పుట పునరుక్తి. నీపాదోదకము ఆకాశగంగవలె మిగులఁ బవిత్రమైన దని భావము.

ఉ.

వానిది భాగ్యవైభవము వానికి పుణ్యవిశేష మెమ్మెయిన్
వాని దవంధ్యజీవనము వానిది జన్మము వేఱు సేయ కె
వ్వానిగృహాంతరంబున భవాదృశయోగిజనంబు పావన
స్నానవిధాన్నపానముల సంతస మందుచుఁ బోవు నిచ్చలున్.

63

టీ. భవాదృశయోగిజనంబు = మీవంటియోగులు, ఎవ్వానిగృహాంతరంబునన్ = ఎవనియింటిలో, వేఱు సేయక = భేదము నెంచక, పావనస్నానవిధాన్నపానములన్ = పవిత్రమైన స్నానవిధిచేతను, అన్నపానముల (గైకొనుట)చేతను, నిచ్చలున్ = ఎప్పుడును, సంతసము = సంతోషమును, అందుచున్ = పొందుచు, పోవున్ = వెళ్లునో, వానిది = అవ్వానిదె, భాగ్యవైభవము = అదృష్టదశ, వానిది = అవ్వానిదె, ఎమ్మెయిన్ = ఎన్నివిధములను, అవంధ్యజీవనము = సార్థకమైన బ్రదుకు, వానిది = ఆగృహస్థునిదె, జన్మము = పుట్టుక, ఉత్తమ లగుయోగులకుఁ బరిచర్య చేయఁగలవాఁడె సార్థకజన్ముఁ డనుట.

తా. ఓయోగీశ్వరా! మీవంటిపెద్ద లెవనియింట భేదములేక స్వబంధువులవలెనే స్నానభోజనపానములు చేసి తృప్తి నొంది పోవుచుందురో యాగృహస్థుఁడు భాగ్యవంతుఁడును బుణ్యవంతుఁడు నగును. అటువంటి గృహస్థునిదే సార్థకజీవనమును సార్థకజనము నగును.

తే.

మౌనినాథ కుటుఁబజంబాలపటల
మగ్న మాదృశగృహమేధినుఁ డలంబు
నుద్ధరింపంగ నౌషధ మొండు గలదె
యుష్మదంఘ్రి జోలేశ మొకటి దక్క.

64