Jump to content

పుట:Manu Charitra.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఎందుండి యెందుఁ బోవుచు
నిందుల కేతెంచినార లిప్పుడు విద్వ
ద్వందిత నేఁడు గదా మ
న్మందిరము పవిత్ర మయ్యె మాన్యుఁడ నైతిన్.

61

టీ. విద్వద్వందిత = పండితులచే నమస్కరింపఁబడినవాఁడా! (తాము) ఎందుండి = ఏప్రదేశమునుండి, ఎందున్ పోవుచున్ = ఎక్కడి కరుగుచు, ఇప్పుడు = ఈసమయమునందు, ఇందులకు = ఈప్రదేశమునకు, ఏతెంచినారలు = వచ్చినారు. నేఁడుగదా = ఈదినమునందె, మత్ + మందిరము = నాయిల్లు, పవిత్రము = పరిశుద్ధము, అయ్యెన్ = ఆయెను. మాన్యుఁడను = పూజనీయుఁడను (యోగ్యుల కాతిథ్య మీఁగలుగుట సుకృతాతిశయము) ఐతిన్.

మహాపురుషుల యాగమనముచే గృహము పవిత్రమగు ననుట ప్రసిద్ధము, “శ్లో. యన్మనీషిపదాంభోజరజఃకణపవిత్రితం, తదేవ భవనం.”

తా. ఓయోగీంద్రుఁడా! మీ రెచటనుండి యెచటికిఁ బోవుచు నిచటికి వచ్చినారు? పెద్దలైన మీరాకచేత మాయిల్లు పరిశుద్ధ మయినది. మీదర్శనముచేత నేను బూజ్యతను వహించితిని.

క.

మీమాటలు మంత్రంబులు
మీమెట్టినయెడ ప్రయాగ మీపాదపవి
త్రామలతోయము లలఘు
ద్యోమార్గఝరాంబుపౌనరుక్త్యము లుర్విన్.

62

టీ. ఉర్విన్ = భూమియందు, మీమాటలు = మీరు పలుకువచనములు, మంత్రములు = మంత్రములవలెఁ బావనములైనవి. మీమెట్టినయెడ = మీరు త్రొక్కినచోటు, ప్రయాగ = సుప్రసిద్ధమగు ప్రయాగక్షేత్రమువంటిది. మీపాదపవిత్రామలతోయములు = మీయడుగులు తగిలి పవిత్రమగునిర్మలజలములు, అలఘు...రుక్త్యములు - అలఘు = ఎక్కువగు, ద్యోమార్గఝర = ఆకాశగంగ