ఆవరణానదియందు, ఆఘమర్షణస్నానము = పాపమును బోఁగొట్టు (అఘమర్షణమంత్రముల జపించుచుఁ జేయు) స్నానమును, సాంధ్యకృత్యము = సంధ్యావందనమును, సావిత్రిన్ = గాయత్త్రిని, సైకతస్థలిన్ = ఇసుకతిన్నెపై, కర్మసాక్షికిన్ = సూర్యునకు, ఫల...తతియున్ - ఫల = పండ్లు, సమిత్ = సమిధలు, కుశ = దర్భలు, కుసుమ = పూవులు, ఆది = మొదలగు, బహుపదార్థతతియున్ = పెక్కువస్తువులమూహమును, మడుఁగుదోవతులం = మడివస్త్రములు, గొంచున్ = తీసికొని, బ్రహ్మచారులు = వడగు లగు విద్యార్థులు, వెంటరాన్ = వెంబడివచ్చుచుండ, బ్రాహ్మణుండు = ప్రవరాఖ్యుఁడు, ప్రజ = జనులు, తన్నున్, మెచ్చిచూడన్ = మెచ్చుకొని సందర్శించుచుండ, ఇంటికిన్ వచ్చును = ఇంటి కరుదెంచును.
| శా. | శీలంబున్ గులమున్ శమంబు దమమున్ జెల్వంబు లేఁబ్రాయమున్ | 55 |
టీ. శీలంబున్ = సద్వర్తనమును, కులమున్ = సద్వంశమును, శమంబున్ = బాహ్యేంద్రియనిగ్రహమును, దమమున్ = అంతరింద్రియనిగ్రహమును, చెల్వంబున్ = సొగసుఁదనము, లేఁబ్రాయము = చిఱుతవయస్సును, పోలన్ = కూడియుండఁగా, చూచి = పరికించి, (దానపరిగ్రహణమునకుఁ దగిన సమస్తయోగ్యత లీతనియెడఁ గలవు గాన నితని కొసంగుట యుభయతారక మని) అతండె = ఆప్రవరాఖ్యుఁడె, పాత్రుఁడు = అర్హుఁడు, అని = అని భావించి, ఏభూపాలుఁడు = ఏరాజైనను, ఈవచ్చినన్ = ఇచ్చుటకు వచ్చినయెడల (తమకై తాము రాజులు దాన మొసంగ నింటికి వచ్చిన) సాలగ్రామము మున్నుగాన్ = సాలగ్రామము మొదల్కొనియు, కొనఁడు = పరిగ్రహింపఁడు. మాన్యక్షేత్రముల్ = మాన్యపుభూములు, (రాజులు మొదలగువారు గౌరవించి పన్ను