Jump to content

పుట:Manu Charitra.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మెత్తుట నైనను, మాన్చున్ = నివారింపఁజేయును, (శూద్రులు పంటఁ బండించి భాగ్యముల గడించి సత్పాత్రదానము గావించుటలో సుప్రసిద్ధులని భావము,) వెలయాండ్రు = వేశ్యలు, నాట్యరేఖా...నిరూఢిన్ - నాట్యరేఖా = నృత్యచాతురియను, కళా = విద్యయందు, ధురంధర = బరువు మోసిన (సంపూర్ణముగా నలవడిన) నిరూఢిన్ = నేర్పుచే, రంభాదులైన = రంభ మొదలగు నప్సరస్త్రీలయినను, ఒరయన్ = ఎదుర్కొనునెడ, కాసెకొంగునన్ = వెన్కకు దోఁపుకొను చీరచెంగుచేత, కడపఁగలరు = తిరుగఁగొట్టఁగలరు. చిగురుఁగొమ్మైనన్ = లేఁతకొమ్మ యయినను, చేవ = గట్టితనము గలది.

అలం. అతిశయోక్తి.

దత్తమండలమునందుఁ జివురుచెట్టను నొకజాతిచెట్టు గలదు. ఎంత ముదిరినను దానఁ జేవ యుండదు. గాన నచటఁ బుట్టినఁజివురుకొమ్మైన చేవ యనుచో నాపురమునఁ బుట్టిన చీపురుచెట్టున బుట్టినకొమ్మయుఁ జేవతో నుండు ననుభావము సమంజసము.

రామాభ్యుదయములోని చిగురుకొమ్మయు చేవల్, వసుచరిత్రములోని చిగురుగొమ్మ చేవయు నిట్టిద.

ఉ.

ఆపురిఁ బాయకుండు మకరాంకశశాంకమనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వరనిర్మలధర్మకర్మదీ
క్షాపరతంత్రుఁ డంబురుహగర్భకులాభరణం బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యుఁ డలేఖ్యతనూవిలాసుఁడై.

51

టీ. మకరాంకశశాంకమరోజ్ఞమూర్తి = మన్మథునివలెను చంద్రునివలెను మనోహరమైన యాకారము గలవాఁడు, భాషావరశేషభోగి = వాక్కునందు రెండవయాదిశేషుఁ డగువాఁడు, వివి...తంత్రుఁడు - వివిధతెఱఁగులైన, ఆధ్వర = యజ్ఞములయొక్కయు, నిర్మలకర్మ= పుణ్యకర్మములయొక్కయు, దీక్షా = నియమములకు, పరతంత్రుడు = అధీనుఁ డగువాఁడును,