పుట:Manooshakti.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

సోదరులారా! యికనైన మీకుమారులను బంధుమిత్రులగు పిన్న వయసువారినెల్లరను మనోశక్తిని సంపాదింప ప్రోత్సాహము జేయుచుందురని నేను మిక్కిలి గట్టిగా నమ్మియున్నాను. ఈమనోశక్తిని సంపాదించుటకు పిన్న వయస్సుగానుండినయెడల పట్టుబడుట మిక్కిలి సులభముగా నుండును. కాన బాలురగు వారి నెల్లరను విశేషించి ప్రోత్సాహము జేయుచుందురనియును, మనదేశమంతయు నిట్టి మహత్తుగలిగిన మనోశక్తియెల్లయెడల నల్లుకొని మనదేశీయులనెల్లర నున్నతదశకు మెల్లగ దీసికొనివచ్చి చల్లగ విడిపించునని నాయుల్లమునుం డెల్లపుడును వెల్లువగా సంతోషం బెల్లయెడలకు నల్లుకొనుచున్నది.


సమాప్తము.