పుట:Manooshakti.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

పయోగించుచు “లెమ్ము పెద్దమ్మవారు నిన్ను విడచిపోవుచున్నది. నీకిక నిద్రరాదు మేలుకొనుము" అని నీమనోశక్తి నుపయోగించుచు మెల్లగానూదుము. అంతట నిద్రబోపువాడు కొట్టిపిలిచినవానివలె చప్పున మేల్కొనును.

కోడిపుంజును నిద్రబుచ్చుట.

కోడిపుంజు నొకదానిని దెచ్చి దానిమెడనువంచి రెక్కలసందునబెట్టి కొంచముసేపు పట్టుకొని “నీకు నిద్రవచ్చుగాక” అని దృఢముగా తలంచుచు దానివీపుమీద నీనోటితో చల్లగా యూదుము. ఇట్లుజేసిన యైదారునిమిషములకా కోడిపుంజు నిలుచుండియే నిదురపోవుచుండును.

తేలుబాధ మాన్పుట.

ఎవరినైనను తేలుకుట్టినయెడల కుట్టినచోటున నీదృష్టిని నిలిపి నీమనోశక్తి నీక్రిందివిధమున నుపయోగించుము "తేలువిషము నిన్నేమియు చేయజాలదు. ఒకవేళ నరములద్వారా బాధ పైకెక్కినను తప్పక దిగును" అని నీమనసునందనుకొనుచు బాధగలచోటున చల్లగా సూదుచు చేతితో చుఱచుచుండుము. ఈవిధముగ పెక్కు విధములగు బాధలను కడు సులభముగ నీమనోశక్తివలన కుదర్పగలుగుదువు.

స్నేహమును గలుపుట.

మీగ్రామమునం దిద్దరు బలవంతు లొకరికొకరికి సరి