పుట:Manooshakti.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59

జేయుచుండిన నీవు ప్రతిపర్యాయమును నడిపించగలవాడవగుదువు.

చదువరులారా! మీలోనెవ్వరైన బజారున బోవుచున్నప్పుడు కుక్కలరచుచు గందరగోళమును జేయుచున్న యెడల మీమనోశక్తి యనునది వానినన్నిటి నఱవకుండగ జేయగలదు. ఎట్లన అఱచుచున్న కుక్కలనుచూచి “ఓకుక్కలారా, మీకఱచుటకు శక్తిలేదు, నోరుమూసికొని యూరకొనుడు” అని నీశక్తి నుపయోగించిన తక్షణమే వానగురిసి చల్లారినట్లు నిశ్శబ్దముగా నుండును.

చేతిని వంచలేకుండ జేయుట.

ఒకనినిబిలిచి యాతనిచేయిని చాచుమనిచెప్పి పిమ్మట నీదృష్టిని ప్రయోగించుచు మనోదృఢముతో “నీచేయిని వంచజాలపు, నీచేయియందు రక్తము ప్రవహించుచుండుట లేదు. నరములు బలహీనముగ నున్నవి. నీవు చేయిని వంచగలవని నేననినదాక నీకు వంచుటకు శక్తిలేదు” అని యనుకొనుచు చల్లగా చేయిపై యూదుచుండుము. అయిదారు నిమిషము లిట్లుజేసిన తరువాత చేయినివంచమని యడుగుము. పిమ్మట వాడట్లుచేయుట కశక్తుడగును. అదంతయును నీమనోశక్తివలననే జరుగుచున్నది.

ఎవరైన నిద్రబోపుచున్న సమయమున నిద్రనుండి మేల్కొన జేయవలెనన్న యాతని కనుబొమలమధ్య నీదృష్టి ను