పుట:Manooshakti.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

డిన నిశ్చయముగా నీవొకవిధమైన ధైర్యముగల్గి చూచుట కెల్లరకును మిక్కిలి సంతోషముగా నగుపడుచుందువు. ఇంతకన్న నీకెక్కుడుభాగ్య మెయ్యది ? నీస్నేహితులలో నెవరికైన కొంచెము జబ్బుగానుండినగాని లేదా యేదైన కష్టములందు చిక్కియుండినగాని యాతడు దూరముననున్నను నీమనస్సెంతయు కలవరపడుచు నేమియు దోచకుండుట పలుమారు మనమందరమును చూచుచునేయున్నాము. కంటిరా! మన మనోశక్తికై పాటుపడకుండనున్నప్పుడే దూరముననున్న మన స్నేహితునకెద్దియో కష్టము సంప్రాప్తించిన దైనమహిమచే యాతనికి కష్టకాలము సంప్రాప్తమాయెనని మన కేదియో యొకవిధంబుగ తెలియుచున్నప్పుడు మనోశక్తికై విశేషముగా పాటుపడ సంపాదించిన పిమ్మట యోగక్షేమములను కనుగొనలేక యుండెదమనిచెప్ప నెవ్వరైన సాహసింపగలగా?

సామాన్యముగ మనము భోజము చేయుచున్నప్పుడుగాని లేక కాఫీ మొదలగునవి త్రాగునప్పుడుగాని, మసలో నెల్లరకును పలుమారు కొరమారుచుండుట చూచుచునే యున్నాము. అట్టిసమయమున బంధుమిత్రులలో నెవ్వరో కొంతమంది మనలనుగురించి యనుకొనుచున్నారని మనపెద్దలందరును జెప్పుచుండుట పలుమారు వినియున్నాము. ఇదియును విచారింప వాస్తవముగ మనోశక్తివల్లనే గలుగుచున్నది. ఈ విషయమునుగురించి యనేకపర్యాయములు నేనును నామిత్రులును గలసి పరీక్షించియుంటిమి. ఇందుకెన్నడును మాకు పొరపాటు వచ్చియుండలేదు. గాన చదువరులారా! మీరీ