పుట:Manooshakti.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(7)

49

నీమిత్రుడావస్తువు నేచేతిలో బెట్టుకొనెనని ప్రశ్నించుకొనుము. తక్షణమే నీమనస్సునకొక చేయి తోచును. పిమ్మట నీస్నేహితునిబిలిచి మిత్రమా! నీవు ఫలానిచేతిలో నావస్తువును బెట్టుకున్నావని చెప్పుము. ఇట్లు నీవు చెప్పినయెడ నీస్నేహితు డత్యద్భుతముగా నిన్ను మెచ్చుకొనును. కొన్ని సమయముల యందు తప్పిపోవుటయుగూడ సంభవించును. కాని దినసాధనమువల్ల కొన్ని నాళ్ళకు సరిగా జెప్పగలుగుదువు. ఈవిధముగా నెక్కువశక్తిని సంపాదిచిన పిమ్మట దూరముననున్న బంధు మిత్రులయొక్క క్షేమసమాచారములను, వారు తత్కాలమునజేయు పనులనుసైతము జెప్పగలవు. ఇట్లు విశేషించి మనోశక్తిని సంపాదించిన కాణముననే భూతభవిష్యద్వతన్‌మానము మనఋషులెల్లరును చెప్పగలిగియున్నారు. కంటిరా ! యీవాడుక నశించినకారణమున మనదేశమునందిప్పుడట్టిశక్తిని గల్గినవారరుదుగానుండుట తటస్థించినది. వేయేల, యికనైన విశేషించి యిటువంటి గొప్పశక్తిని సంపాదించుటకు ప్రయత్నింతురని మిక్కిలి నమ్మియున్నాను. ఇట్టివాడుకనుజేయు ప్రతిమానవుడును దేవునిసృష్టియందు జన్మించిన ప్రాణికోటు లన్నిటియందును జాలిగలవాడై "అహింసాపరమోధర్మ" అను పెద్దల వాక్యము ననుసరించి ప్రవతిన్ంచుచుండవలయును. సాధ్యమైనంతవరకీ ప్రపంచమున నెట్టి ప్రాణికిని కష్టమును గలుగజేయకుండ నిజముగా నీవేదినమునను జీవహింస చేయు చుండుటలేదని నీ మనస్సాక్షిగా నమ్ముచుండిన చాలును. నీమనసునం దేకళంకమును లేకుండగ కాలమును గడుపుచుం