పుట:Manooshakti.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30


పుల్లలను నడిపించుట .

ఏదైన నొక నునుపగుపుల్లనుదెచ్చి దానిచివరలయందు నీచేతులతో పట్టుకొని నీదగ్గరనున్నవానితో రెండేసియంగుళముల పొడవుగలిగినటువంటి రెండుతిన్నని పుల్లలనుదెప్పించి వానిని మధ్యకువంచుమని జెప్పి పిమ్మట కుడిచేతివైపున నొకటియును, యెడమచేతివైపున నొకటియును నీవుపట్టుకున్న పుల్లమీద బెట్టించి భూమికి తగిలితగులనట్లు బెట్టియుంచుము. తరువాత నీదృష్టిని రెండుపుల్లలపై యుపయోగించి మనోశక్తితో (రెండునుకలసికొందురుగాక) యని తలంచుచున్న కొంతసేపటి కారెండును కాళ్లుగలవాటివలెవచ్చి గలసికొనుటచూచి ప్రతివారు మిక్కిలి యాశ్చర్యమును బొందెదరు.

విత్తనములేక చెట్టునుబుట్టించుట.

సాధారణముగ మేడలయందు బెట్టించు చెట్లతొట్లలో నొకదానిని సంపాదించి దానియందేమియును కల్తీలేని యిసుకను బోయించి యొకచోటబెట్టించుము. పిమ్మట నీవాతొట్టిని జూచుచు "యిందుండి యొక విచిత్రమైన చెట్టు బుట్టును". అని సుమారొక వారముదినములు నీమనోశక్తి నుపయోగించుము. ఆహా యేమి యాశ్చర్యము, తొట్టిలోని మట్టియందు చిట్టిగింజనైన బెట్టకుండగ దిట్టమగుపట్టుదలతో గట్టిగ నీమనోశక్తిని చెట్టుబుట్టుగాకయనుచు తొట్టినేమిముట్టకుండగ చొరబెట్టినచుట్టువారు చెట్టుజూచి పట్టరానిసంతసంబుపడక యుండుటవట్టిదియా! ఇదియంతయును మనోశక్తివల్లనే గలుగు చున్నదనుట వేరుగ జెప్పవలెనా! ఏవిధమైన విత్తనమునుగాని