పుట:Manooshakti.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

యికనైన మీరెల్లరు నీశక్తిని సంపాదించు విషయములో పాటుపడవలసి యున్నది.

ఆంగ్లభాషాసేవకై (1918-19) తెనాలిపురమున నుండుట తటస్థించినప్పుడు నేను నివసించుగదివద్ద స్కూలునందున్న సమయములందు దక్క తదితర సమయములయందు సుమారిరువదిమందికి తక్కువ విద్యార్థులుండెడివారు కారు. వారెల్లప్పుడేదో యొక వింతయగుపనిని జేసి చూపించుడని కోరుచుండెడివారు. ప్రపంచమున స్నేహితులకన్న నెక్కువగా తోడగువారితరులు లేనికారణంబున వారికెన్నడు నెగ్గొనరించి యుండలేదు. ఇట్లు ముఖ్యులగు స్నేహితులలో మ!!రా!! శ్రీ!! కొత్త సీతారామయ్యగారును, జంపాల నారాయణమూతిన్ గారును నాకు విశేషముగ పరిచయము గలిగి యుండిన కారణంబునను నాయందు మిక్కిలి స్నేహభావము గలవారైనందునను మెస్మరిజ మనేక పర్యాయములు జేయుమనికోరిన నాకది శ్రమగా నుండుననుతలంపుతో నన్నెన్నడును విశేషించి వింతకార్యములను జూపుడని కోరుచుండెడివారుకారు. .అయినను వారి స్వభావముసకు నేనమిత సంతోషస్వాంతుడనైవారు కోరకుండగనె పెక్కుయాశ్చర్యపు పనులనుజేసి యుత్సాహమును గలుగ జేయుచుంటిని.. ఏమి; యీలోకంబున స్నేహితులను సంతోషపెట్టుటకన్న నెక్కువైనది రెండవది గలదా! లేదు, లేదు. గాన చదవరులారా, మీస్నేహితులను సంతోషబెట్టుచు మీరుగూడ సంతోషకరముగ కాలముగడుప ప్రయత్నింపరాద? యిటువంటి సంతోషమును బొందు