పుట:Manooshakti.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

నకు రైలురోడ్డుమీదికెట్టులో జేరియుంటిని. అచటనుండి రైల్వేస్టేషను జేరులోపల నొకవంతెన దాటవలసి యుండెను. సుమారావంతెన యేడెనిమిది గజముల వెడల్పుండుటచే దూకుట దులన్‌భమని యిప్పుడు తెలియుచున్నది. నేనావంతెనవద్దకువచ్చి చూచునప్పటికెంత వెడల్పుండినదియును గనుపించకుండెనుగాని మెఱపుకాంతిచే యొకసారిమాత్రము హటాత్తుగ మూడునాలుగు గజములున్నట్లు గనుపించెను. పిమ్మట వంతెనవడ్డున నిలుచుండి సర్వేశ్వరునిపై భారముంచి మనోశక్తి నుపయోగించి యొక్కగంతువైచితిని. కంటిరా! వంతెన యెంత వెడల్పుండినను యొక్కగంతుతో నావలకి జేరవలయునని మనోశక్తి నుపయోగించిన కారణమున యవలీలగనంతటి యత్భుతకార్యమును గావించియుంటిని. కావున మనసునం దేదియైన దృఢముగాదలంచిన నదితప్పకజరుగునని ప్రతివారును తలంచవలసియున్నది.

చదువరులారా! మీరుగూడ నీమనోశక్తిని సంపాదించి లో'కిములో పెక్కుఘన కార్యములొనర్తురని మిక్కిలి నమ్మి యున్నాను. మీరుప్రతిదినమును రెండునిమిషములకాలము మనోశ క్తిని సంపాదింప వ్యయపెట్టలేరా! ఈ రెండునిమిషముల కాలమును ప్రతివారును వృధాబుచ్చుచుండుట లేద? యిట్లు వృధాబుచ్చుటకన్న నీమనోశ క్తిని సంపాదించుటకు ప్రయత్నింపరాదా! గ్రామమున కొక్కరైననుండిన మనదేశమంతటి మహోన్నతదశ నొందియుండును. గాన సోదరులారా