పుట:Manooshakti.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

న కిరుప్రక్కల వటవృక్షములు గలిగియుండుటచే కన్ను లెంత దెరచినను నాకించుకయు గానుపించ కుండెను. కాని దైవానుగ్రహమువలన మధ్యమధ్య మెఱపులు మెఱయుచుండుటచే మెఱసినపుడెల్ల బాటనుజూచుచు రెండేసి యంగలిడుచుంటిని. ఇట్లు పది యంగలిడునప్పటికి నాకేదియో యొకశబ్ద మేడ్చినట్లుగ వినబడెను. బెదరినవానికి గుదిరినవన్నియు పిశాచములేయన్నట్లు యీశబ్దమును నేనిదివరకెన్నడును వినియుండని కారణంబునను, యేదోయొక భయంకరముగ వినుపించిన కారణంబునను, మార్గమునందు బాలుడనగు నేనొంటరిగ ప్రయాణముచేయుచుండిన కారణంబునను, గాఢాంధకారముగ నుండి వషన్ ముగూడ కురియుచుండిన కారణంబునను, పిడుగుబడినవానిమాడ్కి కదలక మెదలక నిశ్చేష్టుడనై కొంచెముసేపచ్చట నిలిచియుంటిని. కాని బండివెళ్ళునను తొందరచే రైల్వేస్టేషనునకు బోవలసినవాడనైతిని. అదేమియోగాని బయలు దేరునప్పటికి రోడ్డు రెండువైపులకును, చీలియుండెను. కాని పగలెప్పుడును నేనీదారిని బాగుగ గుతిన్ంచియుండని కారణమునను, రోడ్డు చీలక యొకటిగనేయున్నట్లు మనస్సునకుతో చినందునను మిక్కిలి యాశ్చర్యమును బొంది యెటుబోవుటకును దోచక కొంతతడ వచ్చటనే కాలము వృధా బుచ్చితిని. “వరదను గొట్టుకొని పోవువానికి తెప్ప యొకటిదొరకి”నట్లు నాకట్టికాలమున నేను సాధనముజేయుచున్న మనోశక్తి జ్ఞప్తికివచ్చెను. సర్వేశ్వరునికృపచే నామనోశక్తి నట్టిసమయమున నుపయోగించిన కొంత తడవు