పుట:Manooshakti.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనోశక్తి


ఈ భూలోకంబున మనుష్యులైపుట్టిన వారందరును పొందదగిన కార్యములలో ముఖ్యమైనది జ్ఞానము. ఏపనిజేయుటకైనను జ్ఞానమే ముఖ్యాధారమై యున్నది. ఇట్టి జ్ఞానవంతులకు లోకమునందు చేయరాని కార్యము లేదు. మనస్సును నిగ్రహించి మహానుభావులైనవారు ప్రతివారికిని గావలసిన కార్యములను సాధించియిచ్చుటకు శక్తులగుదురు. మనస్సును తనయిష్టమువచ్చినట్లు చొరనీక వశముజేసికొని పరిశుద్ధజ్ఞానమును పొందినవారు పూర్వము మనదేశమునం దనేకులు గలరు. ఇప్పటికిని యమెరికాదేశమునందు మనస్సుచే చేయదగిన యద్భుతకార్యముల నెన్నింటినోచేసి మిక్కిలివన్నె కెక్కి యున్నతదశనొంది ప్రకాశించుచున్నారు. పిల్లవానిని నిరాధారముగ గాలిలో నిలుచుండబెట్టుటయును, సమాధులం బ్రవేశించి రెండుమూడునెలలకు పిమ్మట ప్రాణముతో వెలికివచ్చుటయును, ఒకేకాలమున ననేకచోటులయందు గానుపించుటయును, యాకాశమున పెక్కద్భుతకార్యములను జూపించుటయును, తాను జెప్పున దితరులొప్పుకొనునట్లు జేయుటయును మనుజులను తదితరమృగములను నిద్రపోవునట్లు జేయుటయును, మరల నిద్రనుండి లేపుటయును, తానేచెడ్డకార్యమును జేసిన నితరులకు మంచిగానుండునట్లు జూపుటయును, చాల