పుట:Manimalikalu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

6.

ఎకరాలు గజాలు ఐపోతున్నాయ్‌ ఆరాటమేల? ఆరడుగులేగా చివరకు!

7.

హృదయ కవాటం తెరిస్తే కనులు రెండూ జలాశయాలే

8.

నాదిష్టే పడేలా ఉంది నీపై బుగ్గపై చుక్క పెట్టనా పెదవులతో?

9.

సూరీడులా ఆమె ప్రొద్ధుతిరుగుడుపువ్వుల్లా కుర్రకారు

10.

చితే చల్లన చితికిన మనసుకన్న

11.

వేడని శిలకు నైవేద్యం వేడుతున్నబిచ్చగాడికి పూజ్యం

12.

అమావాస్య రోజూ వెన్నెల చెలిజాబిలి జ్ఞాపకాలు పరుస్తూ

13.

చెలి నీడ జాడైనా లేదు పిచ్చి కాకపోతే వెన్నెలకు నీడెంటి?

14.

ఆకాశపు దారాలతో నీలంచీర నేసినట్టుగా చినుకులలో సముద్రం

15.

నేనెన్ని లెక్కలు రాసినా నీ లెక్క ముందే రాసి పెట్టేసావుగా విధీ?

మణి మాలికలు :: రాజేష్‌ యాళ్ళ