పుట:Manimalikalu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56.

కవితా హారం తయారు చేసే క్రమంలో పాపం అక్షరాలను గుచ్చుతున్నానన్న సంగతి మరిచా!

57.

మనిషంటే మనిషే అనుకున్నా మనసుకి తొడుగని తెలుసుకోలేకున్నా

58.

అతడి గొంతులో గరళం అందుకే ఆకాశమంతా నీలం

59.

మనసు పేరాంనికొచ్చా వలపుగంధం పూయవూ?

60.

మానవ మృగమట బహుశా పొగడ్తేమో!

61.

గందరగోళంలో చెప్పబట్టే గీత బాగా ఎక్కి ఉంటుంది

62.

అతడికి చెప్పడానికి మాత్రం ఇరవై నిముషాలు మనకు అర్థం అవ్వడానికి జీవితాలకి జీవితాలు

63.

అల పాఠం నేర్చుకోవూ వెనక్కెళ్ళినా అదే స్పూర్తితో ముందుకు దూసుకు రావాలని

64.

తీరం నవ్వుతోంది అలెప్పుడూ తనని చేరలేదని దానికి తెలీదు అల తనని కోసుకుపోతోందని !

65.

ఆశల సౌధం కూలితే ఇంకా ఒకటి కట్టే పని నీ చేతుల్లో..

మణి మాలికలు జ శ్రీనివాస్‌ యల్లాప్రగడ

91