Jump to content

పుట:Manimalikalu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

6)

ఎందుకలా నువ్వు కోపంగా చూస్తావు?
అస్సలే బయట ఎండలూ మండిస్తున్నాయ్‌!

7)

గుండెని రాయి చేసుకుంటా
రామపాదంలా నువ్వే వస్తానంటే

8)

కాలమా...పరుగెత్తు నా అంతానికి
తెరపడిపోనీ...తనతోడులేని నా జీవితానికి

9)

ఇద్దరమూ నలుగుతున్నాం
కాలానికి బంధీనై నేను.. కర్తవ్యానికి బధుడవై నీవు

10)

మళ్లీ ఎదురుచూడటం మొదలెట్టింది..మనసు
నిన్ననేగా నువ్వెళ్ళావన్న సంగతి మరచి

11)

మనసెంత పిచ్చిది
వరించింది గతంలో.. తరిస్తున్నది నీజ్ఞాపకాల్లో

12)

కళ్లకెపుడూ చమరింతలే
నీతలపు పలకరింతలతో

13)

నేను నీతలపులని తరుముతుంటే
నాఆత్మ నన్నే వెలివేస్తోంది

14)

విచిత్రమే...!
నామనసు బాధ అక్కడే ఉన్న నీకు తెలియకపోవటం !

15)

గుబులుపిట్ట
ఎంతకీ గుండెగూడు వదిలి పోదేమి?

మణి మాలికలు జ మాధవీ ప్రసాద్‌ .కె