పుట:Manimalikalu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిమాలికలు - మెరుపు కవిత్వం!

కవి యాకూబ్‌

     we have acountry of words-speak speak
            so i can put my road on the stone of stone.

     we have a coumtry of words-speak speak
          so we may know the end of this travel.

Mahmoud Darwish(paleastian poet)

కవిత్వం కేవలం అక్షరాలు మాత్రమేకాదు. అది ప్రపంచం మాట్లాడే భాష. దృష్టికోణం. కవులనే వాళ్ళు రాస్తున్నదేదీ కేవలం వ్యక్తిగతం మాత్రమే కాదు. అది సమాజపుప్రతిఫలనం. సాహిత్యకారులు సృజిస్తున్న ఏ అంశమూ కూడ పరిమితమైన అర్థాలతో మాత్రమే ఉండదు. అది మొత్తం సామాజిక వాస్తవికతను ప్రతిఫలిస్తుందనే వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాల్సి వుంటుంది. మణిమాలికలను నేను చదువుతున్నప్పుడు ఇది కేవలం ఆయా కవులకే పరిమితమై నౖ భావాల వ్యకీక్త ర ణ గా మాత్రమే చూడలనిపించలదే. సామాజిక సందర్భం ,ఇవి రాయడనికి ఏ విధా గా పురికొల్పిందో బేరీజు వేసూ చదవడం ముగించాను. ఈ కవులు యాడృచ్ఛికంగానే ఇన్ని భావాలు రాయగల శక్తి వచ్చిందా? లేక చుట్టూవున్న సామాజిక స్థితిగతులు ఇటువిం మానసిక కిటికీ తయారవడానికి, తమల్ని తాము ఇప్పుడున్న ఉక్కపోసిన తనం, కుంచించుకు పోతున్న మానవ సంబంధాలు ఇత్యాది అంశాలు ఈవిధంగా వ్యక్తీకరించుకోడనికి ప్రేరిపించాయా? అనే కోణంలో చూడడానికి కూడ పురికొల్పాయి. ఇక 'మణిమాలికల' సందర్భంలోకి వస్తే.., చెప్పదలచుకున్న విషయాన్ని వీలైనంత తక్కువ నిడివిలో సూటిగా చెప్పడం అతిక్లుప్తత అనే లక్షణం.కవిత్వానికి ప్రధానంగా ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే. విషయాన్ని వ్యక్తీకరించే పద్దతి, చెప్పేపద్దతి, అభివ్యక్తి ఇందులో వాక్యనిర్మాణమూ, భాష,వాడిన ప్రతీకలు మొదలగునవన్నీ కలగలిసి, అభివ్యక్తీకరించడం తో పాటు, ఆ అనుభవాన్ని పాఠకుల్లో కలిగించఘడానికి ఉపయోగపడే భావచిత్రాలను ఆశ్రయించడం ఒక కవితా విధానం. అంటే, కవిత్వంలో చెప్పే విషయమూ, చెప్పే పద్దతీ రెండూ సమ ప్రాధాన్యతను కలిగి, దృశ్యం రూపుకట్టడంలో భావచిత్రం పనికొస్తుంది. భావచిత్రాలతో చెప్ప డం ద్వారా ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం లేకుండానే కవి చూపించదలచుకున్న, చెప్పదలచుకున్న విషయం పాఠకుడి మనస్సులో రూపుకడుతుంది. 7