పుట:Manimalikalu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా భావాక్షరాలు... తొలిపలుకై

నిరంతరం నేర్చుకోవాలన్న తపన మనల్నిపుసక్త ప్రియు లను చేస్తుంది. ఎందరో కవులు, రచరయితలు తమ ఊహలు, భావాలు, ఆలోచనలు, అనుభవవాలను పుసక్త రూ పంలో ముద్రించి పఠన ప్రియులకు కానుకగా అందించారు. కొన్ని దాశాబ్దాల క్రితం వరకూ పుస్తకం విజ్ఞానాన్ని పంచే మాధ్యమాలలో ముందు వరసలో ఉంటూ వచ్చింది. అయితే విజ్ఞాన రంగంలో వచ్చిన సమూల మార్పులు కారణంగా కంప్యూటర్‌, అంతర్జాలం అనేవి మనిషి జీవితంలో తమ చోటును సుస్థిరం చేసుకుంటూ వచ్చిన నేపధ్యంలో, ఇప్పుడు రచయితల చూపుకూడ నేటి తరం సోషల్‌ నెట్వర్క్‌ అయిన ఫేస్‌బుక్‌, టిట్వర్‌ వంటి వాటిపై పడింది, ఈ పరిస్థితికి ముఖ్య కారణం ఒక రచయిత లేక కవి తన భావాన్ని క్షణాల్లోప్రపంచం నలుమూలలకు చేర్చ గలగడమే కాకుండ ఆ భావంపై ప్రతిస్పందనను కూడ వెంటనే పొందాగలిగే అవకాశం మరియు సౌలభ్యం ఉండటమే. సోషల్‌ నెట్వర్క్‌ విస్తరిస్తున్న తీరుని గుర్తించి, అప్పటికే ఫేస్‌బుక్కులో గ్రూప్స్‌ఏర్పాటు చెయ్యటం ద్వారా చాలామంది కవులను ఒకచోటుకి చేర్చి కవిత్వాన్ని కంప్యూటర్‌ లోనూ మొబైల్‌ లోనూ అందుబాటులోకి తేవడానికి ముందుకు వచ్చిన కవి యాకూబ్‌ గారి కవి సంగమం ఇంకా అలాింటి రెండు మూడు ఇతర గ్రూపుల్ని ఆదర్శంగా తీసుకుని మణిమాలిక గ్రూప్‌ న్‌ 20, 2012న ప్రారంబించాం. అయితే ఎప్పటి నుండో కవిత్వం రాస్తున్న, అప్పుడప్పుడే రాయగలుగుతున్న వారికి మాత్రమే పరిమితమై పోకూడదనే ఉద్ధేశ్వతో కవిత్వమంటే ఆసక్తి వున్నవారు, కవిత్వాన్నిఆసకత్తితో చదు వుతున్న వారందరూ తాము కూడ కవిత్వం రాయగలమన్న ధీమా, నమ్మకం కల్పించే విధంగా గ్రూపునుతీర్చిదిద్దాలని భావించి,రెండువాక్యాలలో మాత్రమే వుండే 'ద్విపాదా కవితలను గ్రూప్‌ వస్తువుగా ఎన్నిక చేసుకోవటం జరిగింది. ఏ ప్రక్రియైునా నియమాలతో, పరిమితులతో చెయ్యబడితే కొంత అదనపు సోయగాన్ని, శోభను పొందటం సహజం. అందరికీ అర్ధమయ్యేలా సరళంగా ఉండే ఒక నమూనాలో కవిత్వం అందించాలని తలచి మొదటి వాక్యంలో ఎన్నిపదాలు ఉంటే... రెండో వాక్యంలో కూడ అన్నే పదాలు గాని లేక గుణిజాల్లో గాని వుండాలి అనే

4