Jump to content

పుట:Manimalikalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. నా ఊహల విహంగాలు నన్నొదలి
     నీ మనసు ద్వీపానికే వలసపోతున్నాయ్‌!

7. పగలూ రేయీ రెండూ నాకిష్టమే
   లేదంటే కలువ...పంకజం అలుగుతాయి

8. మాసిన బట్టల్లో చిరుగులు
   దాయలేని దారిద్యం గురుతులు

9. ఎక్కుపెట్టిన ఇంద్రచాపంలా తను
   తప్పుకోలేక తట్టుకోలేక నేను

10. మగాడి కళ్ళలో తిరిగే సుడిగుండాలు
     ఎన్నటికీ తీరందాటలేని కడలి అలలు

11. నేల నిద్రకి ఉపక్రమించినట్లు ఉన్నది
     వెన్నెలదుప్పటి కప్పుతోంది నింగి ప్రేమతో

12. ఆశల పల్లకిలో జీవితం ఊరేగుతోంది
     బోయీనైన నన్నుచూసి జాలిగా నవ్వుతోంది

13. నీమనసు గెలిచే ధ్యాసలో పడి
     నామనసు పారేసుకున్న విషయం మర్చిపోయా!

14. పగలురాత్రి చెప్పకనే చెబుతున్నాయ్‌
     దేవుడు ఆడుతున్న దాగుడుమూతల్ని

15. నిన్ను కలసిన తొలి క్షణమే
     నన్నుమరచిన మొదటి క్షణం యాదృచ్చికంగా