పుట:Manimalikalu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36.

ఆటలో మేటినే నన్ను ఓడి నిన్ను గెలిచానుగా

37.

సూరీడు తాంబూలం వేసుకుంటాడా? అంత ఎర్రగా పండిపోయాడు

38.

మనం వేసిన అడుగు అడుగును అడుగు...
అడుగడుగుకో అర్థం చెబుతాయి ఏడడుగులంటే ఏంటో

39.

పూలన్ని పోటీపడి పరిమళిస్తున్నాయి...
నీ సిగలో నిలిచే అదృష్టం ముందెవరికి దక్కుతుందంటూ

40.

నామనసు గోడ రంగు వెలిసింది...
నీప్రేమని పూసి వర్ణశోభితం చేస్తావా?

41.

కొండకోనలకు ప్రతిద్వనించడం నేర్పిస్తున్నా
నీ పేరుతో మొదలుపెట్టి

42.

విత్తు విప్లవాల బాటపట్టింది
భూమిలో పాతేస్తే పొరలు చీల్చుకుని మరీ బయటకువస్తూ

43.

గతాన్ని జ్ఞాపకాల గునపంతో తవ్వుతున్నా
నీ గుర్తుల గుప్తనిధాులేమైనా దొరుకుతాయేమోనని

44.

వాడిన వలపుతీగ చిగురు తొడిగింది
నువ్వు ప్రేమధారలతో నామనసును తడుపుతుంటే

45.

రాత్రంతా మొహానికి అబద్దపు నవ్వుల రంగేసుకున్నా
తెల్లారగానే జీవితనాటకం మళ్ళీ నవ్వుతూ మొదలుపెట్టాలని

మణి మాలికలు జ విశ్వనాథ్‌ గౌడ్‌ ఈడిగ

179