Jump to content

పుట:Manimalikalu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

26.

 మాటలు రాని మూగదాన్నంటావు
మౌనంగా మంచుకత్తితో కోస్తావు

27.

మంచు వెన్నెల్లో తడిసిన కలువలు
తమకంతో శశాంకునిపై విసిరే మన్మధబాణాలు

28.

కాలం వెలివేసింది నీ కలల్ని
నిర్దాక్షిణ్యంగా నా ప్రేమను కాలరాసావని

29.

అర్ధభాగం ఇచ్చానన్నావ్‌
అన్నిట్లోనూ నీదే పై చేయంటావ్‌

30.

సరసాలసంద్రం చిన్నబోయింది
మమతల అలలు కినుక వహించాయని

31.

నీవు నవ్విన ప్రతిసారీ
నవరత్నాల నవ్యకాంతుల పులకింతలు

32.

నా గుండెకు స్వాంతన
నీ వలపుగంధాలతో లేపనంపూస్తే

33.

నీ బుంగమూతి విరుపులు
నామదిలో కోహినూర్‌ వజ్రాలమెరుపులే

34.

కన్నుల మాటున దాగిన కోరికలు
ఎదను ఆశ్రయించాయి హత్తుకుంటావేమోనని ఆశగా

35.

నీస్వరానికి సంపెంగలు
నీ నడకకి నాగమల్లియలు దాసోహమే

మణి మాలికలు జ స్వర్ణలతా నాయుడు