పుట:Manimalikalu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

46.

 నాకు నేనే బహుమతినయ్యా
నువ్వునాలోకి ఇంకిపోయాక

47.

నిన్నలోనే ఒదిగిపోతావెందుకు?
నేడుకూడ నీదేలే రా ముందుకు

48.

అక్షరం చిన్నబోతుంది
ఆదర్శం అంతా తనలోనేనా అని

49.

నా నిన్నలో నుండి నువ్వు జారిపోరాదూ
నేడు నీ జ్ఞాపకాల పుట లేకుండేది

50.

రెప్పమాటునే తారాడుతానంటే ఎలా
లోకానికీ పరిచయమవ్వు ఒకసారి

51.

విజేతల హస్తాలతో రాసిన చరిత్రలో
పరాజితుల వాదనలకు వేదనలకు చోటెక్కడ?

52.

క్షణం విలువెప్పుడూ క్షణమే
నిన్ను కలిసిన తొలిక్షణం విలువ మాత్రం నాజీవితం

53.

కాలపురుషుడు ఎంత నిర్దయుడు
క్షణానికో క్షణాన్ని చంపేస్తూ

54.

కాలాన్ని అభిషేకిస్తున్నా
ప్రతి క్షణమూ చెలి ఊసుని తోడుగా తెమ్మని

55.

నీ నిశ్శబ్దం నను తాకిన క్షణమే
నా శబ్దం ఆవిరయ్యింది... నిను చదవానికి

మణి మాలికలు జ సురేష్‌ బాబు రావి