పుట:Manimalikalu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

6.

 నా కలలలోగిలి లోకి తొంగిచూడు నేస్తం
అక్కడఉన్న నీ రూపాన్ని మాత్రం దొంగిలించకు

7.

ఎప్పుడూ జ్ఞాపకాల దుప్పటిలో పవళించటమేనా
వెన్నెలశిల్పమై ఎదురుగా ఉన్నా... భాషించవూ

8.

నాపెదవులు పృధ్విని తాకుతున్నాయి
నువ్వేసిన పాదముద్రలను సృశించటానికి

9.

నిదుర నదిలో
ఎదురుపడే కలల నావలన్నిటిలో నీవే

10.

మౌనం దుప్పట్లో నువ్వు దాచిన మాటల పరిమళం
నా మనసు పొరల్ని మీటుతుంది మృదు మధురంగా

11.

నా జ్ఞాపకాల పొత్తిళ్ళలో పవళించిన పసిపాప
అలసిపోయిన ఒత్తిళ్ళలో నీవో వెన్నెల రేఖ

12.

ఏకాంతం నా నేస్తం అయినప్పుడు
నన్నుకమ్ముకునే జ్ఞాపకం నానువ్వే

13.

మది కాంచే కలలన్నీ నిజాలై నను తడిమితే
ఆ స్పర్శతో మారనా నేనో నిశ్శబ్దపు శిలలా

14.

నా నిద్రలోన నిద్రపోని తలపుల ఘోష నువ్వు
నా కలమింకా రాయని భావాల భాష నీనవ్వు

15.

నాహృదయం బకాసురుని అంశ అనుకుంటా
రోజంతా నీతలపుల విందే కావాలంటా

మణి మాలికలు జ సురేష్‌ బాబు రావి