Jump to content

పుట:Manimalikalu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16)

 మొట్టినా సమ్మతవుే
అందులో నీప్రేమే ఉందిగా నిండుగా

17)

నిజం చెబుతావా నిన్నొకటి అడుగుతున్నా
పెళ్లయ్యాక నామాటే వింటావు కదా!

18)

మనిషిలో మంచితనం
కాలంలో కాలి బూడిద అయ్యింది

19)

ప్రతి నిముషం గుర్తుకొస్తావు
నేను బ్రతికున్నందుకు సాక్షిగా

20)

మల్లెలు కురులలో చేరినప్పుడే
పరవశాల పరిమళములు మగువలకు

21)

అమ్మ ప్రేమామృతంతో
ప్రేమ జగతిలో సజీవులమే ఎప్పటికీ

22)

కౌగిలింతల స్వప్నాలు
కరిగిపోవు మనసుల పెనవేతల మధురిమలో

23)

ఎడబాటుకు చోటేలేదు
ముడిపడిన మమతానురాగాల మనసుల కలయికలో

24)

పెదవులకు సింగారం నీ చిరునవ్వులు
వీనులకు విందులు ఆ సవ్వడులు

25)

నా మనసు సరిగమలంటుంది
చెవిలో చేసిన నీగుసగుసలకు

మణి మాలికలు జ సుకన్యా బీగుడెం

163