పుట:Manimalikalu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36)

 నా కలం కదలికకి ప్రేరణ నువ్వు
నా కాలం కదులటకి కారణం నువ్వు

37)

ఏవో మాయలు తెలుసు మా అమ్మకి
నాకే తెలియని నా ఆకలిని పసిగడుతుంది

38)

నేను స్నేహమనే విత్తునే వేసా నీమదిలో
నువ్విప్పుడు ప్రేమనే మహవృక్షంలో నాకు నీడనిస్తున్నావు

39)

మనిద్దరి మాటలే సమాంతరాలు
మనసులకు లేవు అంతరాలు

40)

నా ప్రేమ
నేను నీకిచ్చిన మొదటి బహుమతి

41)

ఎగసే కెరటం లాంటిది వయసు
తీరం చేరేకొద్దీ వేగం తగ్గుతూ

42)

విచిత్రం
నడవలేని గడియారంలో, పరుగులెత్తే కాలం

43)

తన పొడిపొడి మాటలు
నా చెంపలకు తడి స్పర్శను పరిచయం చేసాయ్‌

44)

నీ అలక మామిడి పులుపు,
నీ కులుకు చెరుకుగడ తీపి

45)

చలి తాకిడికి చర్మం చల్లబడితే
చెలి తాకిడి తగిలి వెచ్చబడింది

మణి మాలికలు జ శ్రీ వెంకటేష్‌ గ్రంథి

159