Jump to content

పుట:Manimalikalu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

6)

 నేను మళ్ళీ పుట్టా నీ ప్రేమలో కొత్తగా
కాని ఈ జన్మకి ఆయువు ఎన్ని రోజులో?

7)

వయసు వేగాన్ని పెంచుతూ
నడక వేగాన్ని తగ్గిస్తూ కాలం ఆడే ఆట

8)

నీలో కలిగే అణువంత భయం
నువ్వు అధిరోహించబోయే ఎత్తుకు అవరోధం

9)

నటిమీద రేపు బాగుంటుందనే ఆశ
నిన్నటి మీద నేడు బాగుందనే సంతృప్తి

10)

టెక్నాలజీ...
విజ్ఞానాన్ని,విభేధాల్ని రెండూ పెంచుతూ

11)

కాలమనే బడిలో
జీవితం జీతం అడగని గురువు

12)

నమ్మకాన్ని హతమార్చింది
విషం వేసుకున్న అబద్ధమనే వేషం

13)

మనిషికి ఉండొచ్చు గర్వం
చెడగొట్టనంత వరకు మనగౌరవం

14)

ముఖస్థుతి కరువయ్యిందట
ముభావంగా ఉన్నాడు

15)

ఆకలి ఖరీదు
ఈకలికాలాన చుక్కలలో

మణి మాలికలు జ శ్రీ వెంకటేష్‌ గ్రంథి