పుట:Manimalikalu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

</poem>106. మన... మధురాలన్నీఒక్కొక్కటిగా మరణం వియోగ గరళాన్ని అయిష్టంగానే త్రాగుతూ

107. నీ నవ్వులీయవూ పెదవిపై పేరుకున్న విషాదానికి పైపూతగా

108. రాత్రిబడిలో చంద్రుడే మేష్టారు చుక్కల చక్కదనాన్ని కళ్ళజోడు సందు నుండి చూసేస్తూ

109. అందాన్నే హరివిల్లుగా చేస్తూ నీవు అనుక్షణం లక్ష్యమైపోతున్న సంబరంలో నేను

110. కన్నుల్లో నీరూపం చేసే నృత్యాలు చీకటి యవనికపై సిరివెన్నెల లాస్యాలు

111. రెప్పల చాటున దాగిన నీరూపం వెన్నెల్లో సైతం తళుకులీనే తారాదీపం

112. నీవు ప్రాణప్రదమన్నది నేనైనా... నాలో ప్రాణదీపమై అఖండకాంతులు వెదజల్లేది మాత్రం నీవే

113. నేనూ నిన్ను ప్రేమించడం మొదలెట్టేసా నన్ను ప్రేమలో మిం(ముం)చావని తెలిసాక

114. గగనకుసుమమే జాబిల్లి అందంలో...అందనితనంలో అచ్చం నీలా

115. జ్ఞాపకవనాలను పెంచుతున్నా... బాధిస్తున్నా...నాటి నీడలోనే మం(ఉం)డిపోతూ </poem>

154

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌