పుట:Manimalikalu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96.

 ఊరించే మరీచికలే
అరచేతిలో నీవు చూపే స్వర్గాలు

97.

రాజకీయ చ(చద)తురంగం
ఎవరికి పావులౌతున్నామో తెలియకుండా సామాన్యుడు

98.

ఊహల పల్లకిలో ఊరిస్తూ నీవు
తలపుల సందిట్లో మైమరుస్తూ నేను

99.

పరిమళాల పండుగే
నీ జ్ఞాపకాలు కూడ విరులైపోతే

100. నేను రోజూ కొలుస్తున్నా
మన మధ్య దూరాన్ని ఎన్నో కాంతి సంవత్సరాలలో

101. పూలకి దారంతోనే ఏకసూత్ర బంధనం
జ్ఞాపకాలు మదిని వేధించే కంటకనందానం

102. నీ(నా) కలలకి యవనికలా
మూసిన కనురెప్పల చీకటి

103. కన్నీళ్లు కూడ కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి
జ్ఞాపకాలు గుండెల్లో గునపాల్లా దిగబడుతుంటే

104. జాణతనం అంటే నీదే...
కొంటెసైగలు నువ్వు చేస్తూ...నిందలు నాపై మోపుతూ

105. గరళం కూడ మధురమే
అది నీ వియోగప్రసాదమైతే

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌

153