పుట:Manimalikalu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

86.

 నాకు దాగ్గరౌతోంది మృత్యువు.
నీవు దూరమøతున్న క్షణాలలో

87.

ఇద్దరం ప్రేమిస్తున్నాం
నువ్వు నన్ను... నేను నీసంతోషాన్ని

88.

నీసిగ్గుల్లో మందారాలు నాకిష్టం
బాగా తెలుసు నీ బొటనవేలు గీసే అర్ధచంద్రికలకర్ధం

89.

వేయికళ్ళు లేవని చింతిస్తున్నా
రిెంటిలోనే ప్రేమంతా నింపుకొని నీకోసం ప్రతిక్షణం నిరీక్షిస్తున్నా

90.

తుమ్మెదా రెక్కలపై సుమాలగుంపు వాలే వింతైన దృశ్యం
మల్లెలు నీ కొప్పెక్కినప్పుడు మాత్రమే కనబడే సోయగం

91.

శిశిరాన్ని చీల్చేస్తూ వసంతం
నిరీక్షణానేత్రాలకి నీ సందర్శనం

92.

వసంతుడు ఋతువంతా బిజీనే
ప్రతీ 'కొమ్మ' కొప్పులో రంగురంగుల పూలు ముడుస్తూ

93.

కలల నిండ నీ తలపుల పరిమళాలు
కన్ను విప్పితే...తలగడ తడిసిన గుర్తులు

94.

విలపించవు సుమాలు
'కొమ్మ' నుంచి తెంచినా...'కొమ్మ' కొప్పులో అమరితే

95.

మరుమల్లె మరీ మూతి తిప్పుతోంది
తన సోయగాన్ని నీతో పోల్చలేదని

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌